Tuesday, April 16, 2024

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను

నాకు చిన్నప్పటి నుంచి డబ్బున్న చుట్టుపక్కల వారిని చూసినప్పుడు వారిలా కోటీశ్వరుడిని అవ్వాలని ఉండేది. కాలక్రమేణా అది పెద్దది అవుతూ బలంగా మారింది. 

కోటీశ్వరుడిని ఎలా అవ్వాలి? అని మార్కెట్లో గల అవకాశాలను పరిశీలించాను. ఆశ బలము, ఆచరణ బలహీనము. 

నాకు కనపడినది పుస్తకములు. కోటీశ్వరుడిని అవ్వడం ఎలా? అని అనేక పుస్తకాలు చదివాను. అవి అంత ఆసక్తిగా లేవు. కొందరు పెద్దలను గమనించాను. స్థిరాస్తుల ద్వారా వారు ధనవంతులైనారు. కొన్ని ఏళ్ళ కింద కొన్న స్థిరాస్తులు, చరాస్తులు, ఇల్లు, స్థలములు, బంగారము, షేర్లు, మాటల గారడీలు వారికి ఉపయోగపడ్డాయి. అందరూ అన్నీ చేయలేరు. 

తెలివైన ఆలోచనలతో, పెరిగిపోయే ఇళ్ల స్థలములు, ఎకరాలు కొన్నవారు, వారి అంచనాలు ఫలించి కొన్ని ఏళ్ల తర్వాత కోటీశ్వరులు అయినారు. ఏ లక్ష్యసాధన కైనా సమయము కేటాయింపు, బలమైన ఆసక్తి, భగవంతుని అనుగ్రహం ముఖ్యం.

విదేశాల లాటరీ టికెట్లు కొని కొందరు కోటీశ్వరులైనారు. వివిధ పేర్లతో అధిక వడ్డీ ఆశ చూపి, కంపెనీలు పెట్టి ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి ఆ తర్వాత బోర్డు తిప్పేసి, ఐపి పెట్టేసి కొందరు ధనవంతులు అయినారు.

సంపద అంటే ఏమిటి? భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద అని రెండు రకాలుగా ఉంది. జ్ఞాన సంపన్నులు కూడా సంపన్నుల కిందే లెక్క. భౌతిక సంపద వలన గౌరవం పెరుగుతుంది. 

ఇది భౌతిక అవసరములను తీరుస్తుంది. అదే సమయంలో శత్రువులను కూడా తయారు చేస్తుంది. చుట్టుపక్కల వారిలో మన మాట చలామణి అవుతుంది. వారి ఆర్థిక అవసరములు తీరడానికి మనని అప్పుగా అడిగేవారు ఏర్పడవచ్చు. ఇచ్చిన తరువాత రాబట్టుకోలేక అనేక ఇబ్బందులు. 

వెనుకటి రోజుల్లో పశు సంపద, గోసంపద కూడా సంపద కింద లెక్క వేసేవారు. ఇప్పుడు ఆ విధముగా చేస్తే లక్ష గోవుల సంపద నిర్వహణను మానవ సహాయంతో చేయటం చాలా ఇబ్బందిగా ఉండవచ్చు. 

ఈ సంపన్నులను చూసిన తరువాత ఏ సంపద కావాలన్నా పెట్టుబడి కావాలి. అప్పు తేగలిగే సౌకర్యం ఉన్నప్పటికీ, తెచ్చిన తర్వాత మనశ్శాంతి ఉండదు. అభద్రతాభావము, కనపడని ఈర్ష్య గల శత్రువుల గమనిక ఉంటుంది. ఈ సంపద అయితే నాకు వద్దు.                                                              (ఇంకా ఉంది)

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.