Thursday, June 16, 2022

మానవ శరీర నిర్మాణము - 4

భగవంతుడు నిరాకారుడా ఆకారుడా

ఆకారం లేకపోతే నిరాకారునిగా, ఒక శక్తివంతమైన పదార్ధముగాను, ఆకారం ఉంటే మన సౌకర్యం కొరకు మానవ రూపముగా ఊహిద్దాము. 

కొందరు మానవులు కష్టములలో ఉన్నప్పుడు దైవసహాయము సలహాల రూపంలో కానీ, ఆర్థిక సహాయం ద్వారా కానీ ఎదురుగా ఉన్న కొందరి మానవుల రూపంలో జరుగుతుంది. అప్పుడు సహాయము పొందినవారు దైవము ఎదుటివారి రూపములో ప్రవేశించి తమకు సహాయం చేశారని అనుకుంటారు. చివరిగా సహాయము అందేది మానవరూపం ద్వారానే. చాలా సమయములలో దైవ సాక్షాత్కారము మానవ రూపంలోనే ఉంటుంది. 

నిరాకార రూపమును మనము గుర్తించాలంటే శబ్ద రూపముగానే అనగా అశరీర వాక్కు ద్వారా జరుగుతుంది. చివరిగా మనము తెలుసుకోవలసింది ఏమంటే దైవమునకు ఆకారము ఉన్నా, లేకపోయినా సాక్షాత్కారము ఆకార లేక నిరాకార రూపములలో జరుగవచ్చు. సమయ సందర్భములు దీనికి అనుకూలించాలి.

రెండు ఉదాహరణలు తెలుసుకుందాము. భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారి పాలనలో మన్రో అనే కలెక్టర్ ఉండేవాడు. ఆయన అతని జీవిత కాలములో భగవంతుని దర్శించినట్లు, మాట్లాడినట్లు బ్రిటిష్ వారి చరిత్రలో వ్రాయబడినది. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మంత్రాలయములోను, ఒంటిమిట్ట కడప జిల్లా శ్రీరామచంద్ర స్వామి దర్శనమిచ్చి మాట్లాడినట్లు మనకు తెలుస్తున్నది. ఈ సంఘటనలు ఆస్తికులకు సంతోషము కలగజేస్తాయి.

దీనివలన నాస్తికులకు కొన్ని సందేహములు తొలగవచ్చు. కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామమునకు ఆరు కిలోమీటర్ల దూరంలో పెనుమత్స అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో ఒక సాధారణ మహిళ యోగములో సిద్ధి పొంది, దైవ సాక్షాత్కారము పొంది పెనుమత్స మహాయోగినిగా పేరు పొందింది. 1958-60 ప్రాంతములో ఈమెను గూర్చి చెన్నై నుంచి వెలువడే పిల్లల మాస పత్రిక బాలమిత్రలో వ్రాశారు. చెన్నైకు చెందిన సినిమా రంగ ప్రముఖులు ఈమె శిష్యులు. పెనుమత్స గ్రామ శివారులో ఈమెకు దేవాలయం నిర్మింపబడి పూజలందుకుంటున్నది.

అసహాయ మానవుల సహాయనిధి:

ఈ దేశములో ఎందరో అసహాయ మానవులు, బలహీనులు, చేతిలో ముద్ద ఉన్నా తినలేని అసహాయ మానసిక రోగులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమైన తరువాత ఆర్థిక ఆరోగ్య అవసరముల కొరకు బాధితులు ప్రభుత్వము లేక ప్రజల సహకారముతో మెరుగైన సహాయ పథకములు అందుబాటులోకి రావాలని ఆశించటము సహజ కోరికగా చెప్పుకోవచ్చు. 

ఇందుకుగాను ప్రభుత్వము ఈ విధముగా చేయవచ్చు. సోషల్ సర్వీస్ ఫండ్ లేదా అసహాయ ప్రజల అభివృద్ధి పన్నును ప్రతి పది ఏళ్ళకు ఒకే మాదిరిగా ఉండే పన్నును వందకు రూపాయి చొప్పున వసూలు చేసి అసహాయులకు అందించవచ్చు. ఇందుకు సేవా సంస్థల సహాయం తీసుకోవాలి. నిధులు దుర్వినియోగం జరగకుండా రాజీ పడని కఠిన పర్యవేక్షణ, దోషులకు ఆలస్యం లేని కఠిన శిక్ష పద్ధతులు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

నీతి: ఒత్తిడి లేని జీవితం లేదు. అయినా ఒత్తిడి తగ్గితే ఆరోగ్యము బాగుంటుంది.

అంకితము: మానవుడు సంఘజీవి. ఎన్నో వృత్తులవారి సహకారముతో మానవ జీవితము సజావుగా నడుస్తుంది. తాము చేయు వృత్తిలో అంకితభావంతో పని చేయు వృత్తిదారులకు అంకితము.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.