Sunday, October 27, 2024

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాలు మోతాదుకు మించితే భయం కలిగించి, చికాకు తెప్పిస్తాయి. 

ఇది కాలుష్య కారకం కూడా. దాన్లోనే మనం నిశ్శబ్దాన్ని వెతుకుతాం. మన శాస్త్రములు నిశ్శబ్దమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. మన సాధన ఓంకారంతో ప్రారంభం అవుతుంది. దాని నుండి నిశ్శబ్దమునకు ప్రయాణం మొదలవుతుంది.

బయటకు వస్తే వాహనముల ధ్వని, యంత్రముల ధ్వనితో జీవన ప్రయాణం సాగుతుంది. విచిత్రమేమిటంటే అనేక రకముల శబ్ద తరంగముల ప్రకంపనలు, అనేక కీటకములు, జంతు పక్షుల శబ్దములతో పాటు సంగీత ధ్వనులు కూడా మనకి ఆహ్లాదము కలగజేస్తాయి. మన మాట కూడా శబ్దమే.

ఇంతగా శబ్దములకు అలవాటు పడిన మనకు మనం శబ్దం లేకుండా ఉండగలమా? శబ్ద తరంగములు మోతాదు మించితే కాలుష్య కారకమైనా దానితో సహజీవనం అనివార్యం.

శబ్ద తరంగముల వలన జీవితంలో అనేక విచిత్ర విషయాలు జరుగుతాయి. ఈ సందర్భంలో సంగీత ధ్వనుల ద్వారా ఒక స్వామిజీ చేసే రోగ నివారణను చెప్పుకోవచ్చు.

శబ్దములో శాంతి ఉంది, ప్రశాంతత ఉంది. విషయము ముందుకు పోవాలంటే శబ్దమే మార్గదర్శకం. కొన్ని శబ్దములు చికాకు కలిగించినప్పటికీ, కొన్ని మంచి మాటలు, సంగీత శబ్దములు కలిగించే ఆనందము వెలకట్టలేనిది. శబ్దములో ఆనందం వెతుక్కోవటంతోనే మన జీవితం ముందుకు సాగిపోతుంది.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...