Saturday, January 20, 2024

అయోధ్యలో శ్రీరామ ప్రభువు ప్రాణ ప్రతిష్ట

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన అమృత ఘడియలు రానే వచ్చినాయి.

ఆనందం అర్ణవమయ్యే సమయం - అంబరాన్ని అంటే సంబరం

మేళతాళాలతో అక్షతల స్వీకారం - శ్రీరామ మందిర శ్రీకారం

సకల జనుల కోలాహలం - శ్రీరామ ప్రభుని  ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

హృదిలోని ఆశల పల్లకికి రెక్కలు వచ్చిన తరుణం - ఆనందానుభూతులతో ఎద మురిసిపోయే సమయం

ఈ మహాద్భుతాన్ని వీక్షించే అరుదైన అవకాశం వదులుకోకండి. తనివితీరా చూసి, మదిలో సంతోషాన్ని నింపుకోండి.

వచ్చే వచ్చే కొత్త సంవత్సరం

తెచ్చే తెచ్చే కొత్త సంరంభం

అయిదారు వందల నాటి అద్భుత సంబరం

సాకారం అవుతుండగా ఆహ్లాద సమ్ముదం

గణతంత్ర దినోత్సవానికి ముందే

ప్రజలందరూ గుమికూడి చేయు సమైక్యతా విందే

పరాయి దేశ రాజులు వచ్చి మందిరాన్ని కూల్చగా

పరమత సహనం మాకుందని మతాలన్నీ ఒక్కటవ్వగా

శ్రీరామ ప్రభు ప్రాణప్రతిష్ట ఎంతో అబ్బురం

భిన్నత్వంలో ఏకత్వం చూపించిన ప్రజా నిబ్బరం

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే జనవరి 22

శ్రీరామ ప్రభుని ఆశీర్వచనాలతో ప్రజల మది నిండు

అంబరాన్నంటాలి అత్యున్నతమైన భారతావని కీర్తి

జయ కేతన సవ్వడితో మువ్వన్నెల జెండా దీప్తి

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.