Wednesday, January 17, 2024

గుజరాత్‌లోని మోధెరా సూర్య దేవాలయం

గుజరాత్‌లోని మోధెరా సూర్య దేవాలయం గురించి చాలా తక్కువమందికి తెలుసు. ఈ మధ్య మా చెల్లెలు వాళ్ళు ఆ గుడికి వెళ్ళి వచ్చారు. దాని గురించి కొన్ని విషయాలను ఇక్కడ పంచుకుంటున్నాను. 


ఈ సూర్య దేవాలయం మోధెరా అనే గ్రామంలో పుష్పవతి నదీ తీరాన ఉంది. ఈ దేవాలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం ఉపయోగించలేదని చెప్తారు. దీని వాస్తు శిల్ప కళా నైపుణ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 

ఈ ఆలయంలో ఉన్న మండపంలో 52 స్తంభాలు ఉన్నాయి. వాటిని సంవత్సరంలో ఉన్న 52 వారాలకు ప్రతీకగా భావిస్తారు. మరొక అద్భుతమైన విషయమేమిటంటే జూన్ 21వ తేదీన, గర్భగుడిలోని విగ్రహం యొక్క కిరీటం మీద సూర్యుని యొక్క తొలి కిరణం పడుతుందని, దాని ద్వారా గర్భ గుడి మొత్తం ప్రకాశిస్తుందని చెప్తారు. ఈ అద్భుతాన్ని చూడటానికి అనేకమంది భక్తులు ఆ రోజున ఇక్కడకు విచ్చేస్తారు. 


ఈ ఆలయంలోని మెట్ల బావి సూర్య కుండకు ఒక విశిష్టత ఉంది. అందులోని నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఈ మెట్లు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. ఇక్కడ ఉన్న మెట్లపై 108 ఆలయాలు ఉండేవని చెప్తారు, అయితే ప్రస్తుతం వాటిలో ఎన్ని ఉన్నాయో చెప్పటం కష్టం. అయినప్పటికీ, ఈ మెట్లు వాటి ఆలయాలతో కలిసి చాలా అందంగా కనిపిస్తాయి. 


ఈ సూర్య దేవాలయానికి 14 కిలోమీటర్ల దూరంలో బహుచరాజీ అనే పిలవబడే బహుచరామాత ఆలయం ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారు చాలా మాహాత్మ్యం కలిగినది. ఆమె పేరు తలుచుకొని నమస్కరించుకుంటే, ఎటువంటి మరణకర పరిస్థితులలో నుండైనా వెంటనే విడిపించ కలదని భక్తులు విశ్వసిస్తారు. చండీ యాగం చేస్తే ఎంత మహత్తు ఉంటుందో ఆమె దర్శనానికి అంత విశిష్టత ఉంది. ముఖ్యంగా మాటలు రానివారు మొక్కుకొని నాలుకలు (గుడి బయట అమ్మేవి) కొని సమర్పిస్తే, మాటలు వస్తాయని అనేకమంది నమ్మిక.

Image Courtesy: Author's Sister

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.