Saturday, July 29, 2023

జీవితములో ఏ సేవ ముఖ్యము - మానవసేవా లేక దైవ సేవా

దైవ సేవను పక్కనపెట్టి మానవ సేవను గూర్చి తెలుసుకుందాం. మానవసేవను ఈ క్రింది విధంగా విభజించవచ్చు. ప్రభుత్వ పరంగాను, వ్యక్తులు పరంగాను లభించేది. 

చాలా సేవలకు నిర్ణీత రుసుములు ఉంటాయి. కొన్ని మాత్రం ఉచితంగా ఉండవచ్చు. మానవ జీవితంలో ఎన్నో అవసరాలు, సౌకర్యముల కొరకు తోటి వారి మీద ఆధారపడతారు. ఉదాహరణకు రవాణా సౌకర్యములను చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా లభించుతాయి. అయితే వాటికి రుసుములు ఉంటాయి.

విద్యా సేవలు ప్రభుత్వ, ప్రైవేటు పరంగా లభిస్తాయి. ఇతర సేవలు రకరకాలుగా వివిధ రుసుములతో అందుబాటులో ఉంటాయి. మనిషికి కనీస అవసరాలుగా భావించే గుడి, బడి, ఆసుపత్రి, వసతి, ఆహారము వంటివి వీటిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు.

ఎన్నో సేవా సంస్థలు - రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, స్కౌట్స్, ఇంకా అనేక ఇతర సేవా సంస్థలు ఉన్నా మన అవసరాలకు తగినన్ని లేవు. ఇంకా కావలసి ఉంది. పేదలకు తక్కువ ధరలో భోజనం,  వసతి, ఆరోగ్యవసతి, నిలువ నీడ కావలసి ఉంది. 

నాకు తెలిసిన ఒక ఆవిడ భర్త జ్ఞాపకార్థం ఉచిత హోమియో వైద్యశాలను నడపడం కూడా మానవ సేవలో భాగమే. 

దైవ సేవ: దేవుడు ఉన్నాడా, లేడా అని పరిమిత జీవిత కాలం అంతా పనికిరాని వాదోపవాదములతో కాలం వృధా చేయవద్దు. ఆ వాదనల వల్ల నిజం తేలదు. దేవుడంటే ఒక నమ్మకం. దైవానుభూతి మనకు స్వయంగా కలగాలి. ఎవరో చెప్తే నమ్మవద్దు. ఫలితం కనపడదు. జీవితంలో ఒకరోజు గడిస్తే మనకున్న ఆయుర్దాయంలో ఒక రోజు తగ్గినదని గమనించాలి. 

నిజంగా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని నమ్మినా, లేడని నమ్మినా పెద్ద తేడా లేదు. నమ్మకపోతే శిక్షిస్తాడని, నమ్మితే వరాలు కురిపిస్తానని అనుకోవద్దు. ఉన్నాడని నమ్మినవారికి దైవానుభూతి కలగవచ్చు. నమ్మని వారికి నిదర్శనాలు కనిపిస్తే నమ్మవచ్చు. ఆ అనుభూతి కావాలంటే కాల ప్రవాహంలో నిరీక్షించాల్సిందే. 

రోగనిర్ధారణకు ధర్మామీటర్ వాడినట్లు పాప పుణ్యముల కొలబద్దని గూర్చి ఆలోచించవద్దు. దైవం ఉన్నాడని నమ్మేవారికి కూడా దైవం వలన జరిగే మేలు తోటి మానవుల ద్వారా మాత్రమే జరుగుతుందని గ్రహించాలి. అలాగే దైవం నిరాకారుడా, ఆకారుడా అనే వాదన కూడా అనవసరం.                                (ఇంకా ఉంది)


No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.