భాష లేకపోతే మనిషికి వేరేవారితో సమాచార మార్పిడి చాలా కష్టం. ఏ విధమైన భావ ప్రకటన చేయాలన్నా లేదా కమ్యూనికేషన్ కొరకు భాష అత్యంత అవసరము. సంస్కృతము మనదేశంలోని భాషలన్నింటికీ మాతృభాష.
మనిషి పుట్టినప్పటి నుండి చావు తర్వాత జీవితములాంటి ఎన్నో విషయములపై సాహిత్యం సంస్కృత భాషలో ఉంది. పూర్వము జర్మనీ దేశంలోని కొందరు పండితులు భారతదేశమునకు వచ్చి సంస్కృతము నేర్చుకొని దాని ద్వారా సాహిత్యం మొత్తము వారి భాషలోనికి తర్జుమా చేశారు.
దానితో సంస్కృత సాహిత్యమునకు ఖ్యాతి పెరిగింది. కానీ ఈనాడు ప్రపంచం మొత్తాన్ని శాసించేది ఆంగ్లభాష. ఆధునిక టెక్నాలజీ అంతా ముందు దాని ద్వారానే వెలుగులోకి వచ్చి, తర్వాత మిగిలిన భాషలలోకి మారుతుంది. ఉదాహరణకు టైప్ మిషన్, కంప్యూటర్ వంటివి. అలాగే అన్ని మందులు ఆంగ్లంలోనే ఉంటాయి.
మనము ఎంతగా ఆంగ్ల భాషకు అలవాటు పడ్డాము అంటే ఒకరోజులో మనం మాట్లాడే పదాల్లో అనేక ఆంగ్ల పదాలు ఉంటాయి. అవి లేకుండా మనం మాట్లాడలేము. ప్రపంచ ఖ్యాతి పొందిన ఆంగ్ల భాషకు మనము ఒకరకంగా బందీలమైనట్లే.
No comments:
Post a Comment