Monday, June 5, 2023

దురదృష్టము

అదృష్ట, దురదృష్టములు పక్క పక్కనే కలిసి ఉంటాయి. ఉదాహరణకు ఒక ప్రమాదము జరిగినప్పుడు తేలికగా ఏమీ దెబ్బలు తగలకపోతే అదృష్టముగా భావిస్తాము. 

ఒక ఉదాహరణ చెప్పుకుందాము. ఒక బండి మీద వెళుతున్నప్పుడు ప్రమాదము జరిగితే కింద పడతారు. కళ్ళజోడు పగిలినప్పుడు కళ్ళు మూసుకుంటే పగిలిన గాజు ముక్కలు మన కంటి లోపలికి పోవు. అదే కళ్ళు మూసుకోకపోతే పగిలిన గ్లాసు ముక్కలు మన కంటిలోకి పడి పెద్ద గాయాలు అవుతాయి. 

అపశకునములు దురదృష్టమునకు సూచనగా చెబుతారు. బల్లిపాటు, తొండపాటు లాంటివి కొందరు నమ్మకం లేని వ్యక్తులు, విజ్ఞాన పరంగా ఆలోచించేవారు, అపశకునములు నమ్మకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. 

కొన్ని వస్తువులు కంటికి ఒకటిగా కనబడినా రుచి చూస్తే తేడా తెలుస్తుంది. ఉప్పు కర్పూరం ఒకటిగా ఉన్నా రుచులు చూడ జాడ వేరయా అని ఒక శతక కర్త చెప్పినట్టు అదృష్ట, దురదృష్టములు మనకు కలిగించే నష్టమును బట్టి అది అదృష్టమా, దురదృష్టమా అని తేల్చుకునే సందర్భాలు కొన్ని వస్తాయి. 

ఉదాహరణకు మనము ఒక చోటికి లాభసాటి వ్యవహారములో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఏదో అడ్డంకి వచ్చి రైలు గాని, బస్సు గాని మిస్ అయితే, మనము వెళ్లలేనప్పుడు బాధపడినా ఆ ప్రయాణంలో ఏదైనా ప్రమాదము జరిగి కొందరికి ఇబ్బంది వచ్చిందని తెలిసినప్పుడు మనము ఊపిరి పీల్చుకుంటాము. వెళ్లలేకపోవడం అదృష్టముగా భావిస్తాము.

అదృష్టం అందలం ఎక్కిస్తే దురదృష్టం కిందకి లాగింది అనే మాట ఈ కింది సందర్భంలో వర్తిస్తుంది. ఒకరికి అధికార పదవి రాగానే నోటి దురదతో నోరు జారితే ఆ పదవి ఊడిన సందర్భం చెప్పుకోవచ్చు. 

అదృష్ట దురదృష్టములు నమ్మని వారికి ఏ చీకు చింత లేదు. అంతా ఆనందమే. అదృష్ట, దురదృష్టములు దైవాధీనము నమ్మే వారి పరిస్థితి కూడా ఇంతే. 

సుఖములు, సంతోషము కలిగినప్పుడు అదృష్టం గాను, దుఃఖంతో కూడిన సందర్భములు జరిగినప్పుడు దురదృష్టముగాను చాలామంది భావిస్తారు. 

అదృష్టమునకు తలుపులు తెరవకా దురదృష్టమును ఆహ్వానించామని కొందరు అనుకున్నప్పటికీ మంచి అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోలేక ఆకర్షణతో దురదృష్టం కలగజేసే పనులు చేశానని అర్థం చేసుకోవాలి. 

ఉద్యోగం లేని వారికి రాత్రిపూట ఉద్యోగం దొరికినప్పుడు అదృష్టంగా భావించినా, వివాహం అయిన తర్వాత మారిపోయిన జీవిత విధానంలో దురదృష్టముగా అనిపించవచ్చు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...