Monday, June 5, 2023

మనకు తెలిసినా పాటించలేని, సాధ్యము కాని జాగ్రత్తలు, వాస్తవిక విశ్లేషణలతో

1. గోళ్ళు నోటితో కొరకరాదు - గోళ్ళలో మట్టి బ్యాక్టీరియాతో కలిసి ఉంటుంది. నోటితో కొరికినప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి విరోచనాలు, ఇతర రోగములు కలుగుతాయి.

2. బయట నుంచి వచ్చినప్పుడు బట్టలు, చెప్పులు విప్పుట, కాళ్ళు కడుగుట చేయాలి. మన ఒంటి మీద వచ్చి పడే బ్యాక్టీరియా కలగజేసే రోగములు. 

3. కాచిన నూనె మరలా కాచరాదు - విషతుల్యము. బయట పనులతో, జీవితంలో అలసిపోయి పాటించలేరు. 

4. రోడ్డు పక్కన వండిన తినుబండ్రాలు తినరాదు - తొందరగా సర్వ్ చేయుట, అందుబాటు ధరలో, ఆకర్షణ. నష్టము తెలిసిన తప్పదు. 

5. రోడ్డు పక్కన ఇళ్లను గమనించండి. వాటి మీద ఎంత మట్టి, దుమ్ము, ధూళి ఉంటాయో. ప్రస్తుతము ఉన్న పరిస్థితులలో రోగ నివారక చర్యలు పాటించడం చాలా కష్టము. జీవనశైలి మార్పులో పాత ఆరోగ్య పద్ధతి మారిపోయి కొత్త ఆరోగ్య పద్ధతి వచ్చినందువలన జాగ్రత్తలు ఎంతవరకు తీసుకుంటారో తెలియదు. 

6. చక్కెర, బెల్లం తయారు చేయడం చూసినవారు దానిని పెద్దగా తినలేరని చెబుతారు. 

7. కొన్ని ప్లాస్టిక్ వస్తువుల వాడకము క్యాన్సర్ కారకం అని తెలిసినా మానలేని పరిస్థితి. 

8. కృత్రిమ పద్ధతుల ద్వారా పండించిన( పచ్చి పండుని మాగిన పండుగా చేయుట) పండ్లను మానలేని పరిస్థితి. 

9. అతి తేలికగా డబ్బు సంపాదన మార్గము కల్తీ చేయుట ద్వారా వస్తుందని బలమైన భావము వలన రోగాలు పెరుగుతాయి. 

10. బలమైన, క్రమబద్ధమైన ఆహారం తీసుకోకుండా ఆకలి తాత్కాలికముగా అణచివేసే ఫాస్ట్ ఫుడ్స్, టీ, కాఫీ, కూల్ డ్రింకులపై ఆధారపడడం. 

11. మందులు, తినే ఆహార పదార్థములు, నిత్య వస్తువులపై ఎక్స్పైరీ డేట్ గమనించి జాగ్రత్తలు పాటించాలి. 

12. రిఫ్రిజిరేటర్లో అవసరమునకు మించి ఎక్కువ కాలము వండిన వంటలతో కూడిన వస్తువులు ఉంచుట అనారోగ్య కారణము.

13. మన వంట ఇంటికంటే ఆన్లైన్ కొనుగోళ్ల ద్వారా వచ్చే వంట ఇల్లు ఆరోగ్యకరమని భావించి, ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే దొరికే కొనుగోలు అనారోగ్యమునకు అడ్డదారులు అని కొందరు అంటూ ఉంటారు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...