మా అన్నయ్య గారైన (పెద్దమ్మ కొడుకు) శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు గురువారంనాడు హైదరాబాదులో పరమపదించారు. ఆయన ఉద్యోగంలో వివిధ పదవులు నిర్వర్తించి అందరి మన్ననలకు పాత్రులైనారు.
ఆయన టిటిడి ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు భక్తుల సౌకర్యార్థం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నిగర్వి, స్నేహశీలి, జాలి గుండె కలిగిన వారు.
ఆయన జాలి హృదయానికి నిదర్శనంగా ఒక చిన్న సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక మారు ఆయనతో పాటు తిరుమల కొండకు వెళ్తున్నప్పుడు, ఘాట్ రోడ్లో ఒక వృద్ధురాలు నడుస్తూ ఉండటం ఆయన చూశారు. వెంటనే కారును ఆపించి, ఆమెను తన కారులో కూర్చోబెట్టుకొని, తనతో పాటు కొండపైకి తీసుకొని వెళ్ళారు.
ఆ సంఘటన నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఆయన మంచి హృదయానికి నిదర్శనమైన ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
తన తండ్రి జ్ఞాపకార్థం ఒక ట్రస్ట్ పెట్టి అర్హులైన అనేకమందికి ఆర్థిక సహాయం అందించారు. ఆయన సాన్నిహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
No comments:
Post a Comment