నాకు జీవితంలో తెలిసిన విషయాలు లేదా నాకు అందిన కొన్ని సలహాలను నెమరు వేసుకుంటున్నాను. సమస్యల్లో ఉన్నవారికి చుట్టుపక్కల ఉన్న కొంతమంది కొన్ని సలహాలు ఇస్తారు.
అన్ని సలహాలు మంచివి కావచ్చు, కాకపోవచ్చు. కొన్ని దైవ సలహాలుగా భావించవచ్చు. అయితే సలహాలు ఏమి వచ్చినా ఆలోచించి పాటించాలి. విచక్షణ ముఖ్యం. కొన్ని సలహాలు పాటిస్తే వ్యతిరేక ఫలితములు వస్తాయి.
నాకు లభించిన సలహాలలో కొన్నిటిని ఇక్కడ తెలియచేస్తున్నాను:
- ఆవులకు పాలపదార్థములు పెట్టరాదు.
- గోమాతకు ఆహారం పెడితే సకల దేవతలను పూజించిన ఫలితం వస్తుంది.
- చీమలకు ఆహారం పెడితే అప్పులు తీరుతాయి.
- కోతులకు ఆహారం ఇవ్వటం వలన శని అనుగ్రహం లభిస్తుంది.
- భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు అర్ధనారీశ్వర స్తోత్రం చదివితే తీరతాయి.
- దేవునికి అభిషేకం పచ్చిపాలతో చేయాలి.
- దేవునికి నైవేద్యము కాచిన పాలు పెట్టాలి.
- వైద్య పరంగా ఎన్నో మంచి లక్షణములు కల తులసి చెట్టు, వేప చెట్టు ఆధ్యాత్మికతతో కలిసి ఉన్నందున చాలామంది దానిని మతాచారంగా పూజిస్తుంటారు.
No comments:
Post a Comment