Saturday, May 27, 2023

భూమి మీద కోటీశ్వరులు ఎవరు?

కోటీశ్వరుడు అనగా వారి వెనకాల కోట్ల రూపాయలు స్థిర, చరాస్తి రూపంలో ఉన్నవారని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. అయితే దీనికి మనసుతో ఆలోచించేవారు రకరకాల విశ్లేషణలు చెప్తారు. 

1. భారతదేశంలో వెనుక అనగా కొన్ని వందల ఏళ్ళ క్రితం ఇంత డబ్బు, బంగారం ఎక్కువమంది వద్ద లేదు. జనం ఎక్కువగా పశు సంరక్షణ, వ్యవసాయంపై ఆధారపడేవారు. ఇన్ని ఉద్యోగాలు, తద్వారా ఏడాదికి లక్షల ఆదాయం కూడా లేదు. రాయల కాలంలో రత్నాల రాశులు కుప్పలుగా పోసి అమ్మేవారని చరిత్రలో చదువుకున్నాము. పశువులు, గోసంపద ఉన్న వారిని సంపన్నులుగా భావించేవారు. 

ఇన్ని యంత్ర సేవలు అందుబాటులో ఉన్న విషయంతో పోల్చుకుని ఒక పశువుకు ఒక మనిషి సేవ అవసరం ఉన్నప్పుడు, అన్ని లక్షల పశువులకు ఎంతమంది పశు సంరక్షకులు అవసరమో అని కొంతమందికి ఆలోచన వస్తుంది. పూర్వకాలంలో రాజులు దానములలో భాగంగా పశువులను, గోవులను ఇచ్చేవారు. అది పుణ్యఫలంగా భావించేవారు.

2. విదేశాలకు చెందిన ఎందరో ధనవంతులు, కోటీశ్వరులు తాము సంపాదించిన ధనముతో సంతృప్తి చెంది, అక్కడి యాంత్రిక జీవనంతో విసుగుచెంది, వైరాగ్యభావంతో ఆధ్యాత్మిక భావన పెరిగి తాము సంపాదించిన ధనములో అధిక భాగం దానములు చేసి మనశ్శాంతి కొరకు ప్రయత్నించటం మనకు తెలిసిందే. డబ్బు సంపాదించినవారు కోటీశ్వరులు అయితే దాని ద్వారా మనశ్శాంతి పొందిన వారు డబ్బున్నా, లేకపోయినా కోటీశ్వరులే. 

3. పరుల కోసం బతికేవారూ కోటీశ్వరులే. 

4. భగవంతుని మార్గంలో ఉన్నవారూ, వారి వెనక ఆస్తిపాస్తులు లేకపోయినా సంతృప్తి పరులైన వారూ కోటీశ్వరులే. 

ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఆరోగ్యము, మనశ్శాంతి లేని వారికి వారి కోట్లు వృధా. చివరగా మనకు అర్థమైంది ఏమిటంటే సంతృప్తి గల జీవనము మనశ్శాంతితో గడపగలిగిన వారు ఈ భూమి మీద అత్యంత కోటీశ్వరులు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...