Monday, May 8, 2023

మహిమలు

మహిమ అనగా ఒక మహాత్ముడు తన దగ్గరకు కోరికలతో వచ్చిన భక్తులకు వారి కోరికలు తీర్చే విధముగా ప్రదర్శించిన లీలలు లేక భగవంతుని అనుగ్రహ మార్గముగా చెప్పవచ్చు. ఈ భూమి పుట్టినప్పటి నుండి అనేకమంది మహాత్ములు, సిద్ధ పురుషులు అవతరించారు.

వీరిని భగవంతుని ప్రతినిధులుగా భక్తులు భావిస్తారు. వారంతా వారి జీవితకాలంలోనూ మరియు సమాధి చెందే వరకు, చెందిన తర్వాత కూడా అనేకమంది భక్తులకు సమస్యలు తీర్చారు.

వారు ప్రదర్శించిన మహిమలు, వరాలు, మానవాళికి వారు చేసిన భక్తజన ఉద్ధరణ కార్యక్రమముగా తెలుసుకుందాము. గత జన్మలలో యోగ సాధనలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లతో యోగ భ్రష్టులైన వారు వారి పొరపాట్లను సరిదిద్దడానికి ఈ జన్మలో మహిమలు ప్రదర్శించిన వారు ఉన్నారు.

ఆధ్యాత్మిక సాధనలో గత జన్మలో పూర్తి ఫలితము సాధించలేనివారు ఈ జన్మలో ఆ సాధనలో విజయం సాధించి మానవజాతికి సహాయం చేసిన వారు ఉన్నారు. ఈ మహిమలను గూర్చి కొన్ని విషయములు తెలుసుకుందాము.

ఈ మహిమలు పొందిన లేక ప్రదర్శించిన మహాత్ములు అన్ని విశ్వాసములకు సంబంధించిన వారని, వారికి కుల మతాల ఎల్లలు కానీ, వర్గభేదములు కానీ లేవని పాఠకులు గమనించాలి. కొందరు లోక రీత్యా ఒక కులంలో గాని, మతంలో గాని జన్మించినప్పటికీ వారు అందరినీ ఆదరించేవారు. ఏ విధమైన భేద భావములు చూపేవారు కారు. 

వారు భగవదారాధనతో పాటు జనులని ఉద్ధరించటం ముఖ్య ఉద్దేశంగా వారి దేశ యాత్ర సాగింది. వారు ఒకచోట స్థిరముగా ఉండక దేశమంతా పర్యటించి తమ వద్దకు వచ్చిన ఆశ్రితులందరి కష్టములు తీర్చారు. 

ఈ మహిమలను ఈ కింద విధముగా విభజిద్దాము: ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇతరములు.

ఆరోగ్య సమస్యల్లో నయము గాని తీవ్ర రోగములు, ప్రమాదము జరిగినప్పుడు వచ్చిన కష్ట నష్టములు ఉంటాయి. ఆరోగ్య సమస్యలలో పేదరికము, జీవనోపాధి, ఇతరములలో సంతాన లోపం కూడా చెప్పుకోవచ్చు. అకాల మృత్యువు బారిన పడిన వారిని బతికించుట కూడా కొన్ని వస్తాయి.

అప్పుడప్పుడు కొందరు అనుకుంటారు, ఈ భూమిలో అపారనిధి నిక్షేపాలు ఉన్నాయి. అవి అయిపోతే ఏమి ప్రత్యామ్నాయము ఉంది? ఉదాహరణకు పెట్రోల్ బావులు తీసుకుందాం. అవి అయిపోతే మానవజాతి ఏం చేస్తుంది? కొంత భయం వేస్తుంది. 

ఈ సందర్భంలో కొన్ని ఏళ్ళ క్రితము ఒక భగవత్ స్వరూపునిగా కొన్ని లక్షల మంది భక్తులచే భావింపబడిన ఒక అవతార పురుషుడి మాటలను జ్ఞాపకం చేసుకుందాము. "నేను తలచుకుంటే సముద్రపు నీటిని పెట్రోల్ గా మార్చగలను". 

నిజముగా ఆయన సముద్రపు నీటిని పెట్రోల్ గా మార్చగలడో లేదో తెలియదు గాని ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. నిజముగా సముద్రపు నీటిని పెట్రోలుగా మారిస్తే అల్లకల్లోలం చెల్లరేగుతుంది. సముద్రంలో బతికే ఎన్నో జీవరాశులు లక్షల్లో నశిస్తాయి. ప్రకృతి ధర్మం మార్చరాదు. దాని వలన ఏదైనా జరిగితే ఆ పాపము ఎవరిది?

అలాగే ఇంకొక ఊరిలో ఒక మహిళా దైవ భక్తురాలు తన నోటి నుండి లడ్డు ప్రసాదం విడి ముక్కలు లేక పొడి రూపంలో తెప్పించి భక్తులకు పంచి పెట్టేది. అక్కడ ఉన్న భక్తులు స్వీకరించేవారు. కొందరు తెలివైన భక్తులు ఈ విధముగా ఆలోచించవచ్చు. ఆవిడ లడ్డు ప్రసాదము నోటి నుండి కాక తయారుచేసి కూడా పంచి పెట్టవచ్చు. దానివల్ల జాతికి ప్రయోజనం ఏమి జరుగుతుంది? ఆకలి తీరుస్తుంది. 

పంటలు లేకపోతే ఆహారం లేక జీవితము వెళ్తుందా? భక్తి లేక వాస్తవిక ఆలోచనా విధానములు రెండూ సరి అయినవే. ఈ రెండూ సమాజమునకు అవసరమే. కొందరు మహాత్ములు మహిమల ప్రదర్శనలను వ్యతిరేకిస్తారు. ఇది చౌక రకము విద్య ప్రదర్శనగా వర్ణించేవారు. 

కొందరు మంత్ర శాస్త్రంలోని మంత్రములను గురువు ద్వారా గాని స్వయముగా గాని చేయించి కొన్ని శక్తులు ప్రదర్శించేవారు. వారి ప్రదర్శనల ద్వారా డబ్బు లేక ఇతర ప్రయోజనముల ద్వారా ఇతరులను మోసగించేవారు. వారు మోసగించినంతవరకు ప్రజలు వారిని గౌరవిస్తారు. కొందరైతే మంత్ర శాస్త్రము ద్వారా మంత్రసిద్ధి పొంది భూమి లోని నిధి నిక్షేపముల గూర్చి గుర్తించగలిగిన స్థితికి చేరి ఆ తరువాత స్వార్థం పెరిగి ధనిక భక్తులను ధన మోసం చేసిన సంఘటనలు కూడా కొన్ని వెలుగులోకి వచ్చినాయి. 

వైద్యులచే బాగు చేయబడని తీవ్ర రోగములతో బాధపడేవారు మహాత్ముల స్పర్శతో వారి రోగము నయమవటము ఆహ్వానించతగినదే. అవయవ లోపం సరి చేయటం, ఆర్థిక సమస్యలు తీరటము, కుటుంబ సమస్యలు తీరటము, ఏ విధముగా నయినా బాగు చేయబడని సమస్యలు తీరటము అందరికీ సంతోషమే.                                                                                                  (సశేషం)

1 comment:

  1. Thanks for covering most of your experience in blog. Sure this will be very useful for those needed.

    Latest News Updates

    ReplyDelete

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.