Sunday, April 30, 2023

వృత్తి, వ్యాపారములు సులభమా?

ఈ రోజుల్లో అనేకమంది వృత్తి వ్యాపారములు నిర్వహిస్తున్నారు. కానీ అవి నిర్వహించటం అనుకున్నంత సులువు కాదు. దీని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాము.

1. పెరిగిన జనాభాను అనుసరించి పరిమిత ప్రభుత్వ మరియు నిలకడ స్థిర ఉద్యోగములతో పోల్చుకుంటే ఎక్కువ మంది వృత్తి వ్యాపారముల మీద ఆధారపడతారు.
2.
వీరిలో కొందరికి వేధింపులు ఉంటాయి.
3.
ప్రతి రంగంలో ప్రవేశించిన ఆన్లైన్ వ్యాపారము వీరికి పోటీ.
4.
ఏ రంగములో ఉన్నా, వీరి సేవకోసం వచ్చిన వారిని విసుగు లేని చిరునవ్వుతో కూడిన పలకరింపు అవతలవారిని ఆకర్షిస్తుంది.
5.
సేవ కోసం వచ్చిన వారికి చెప్పిన గడువుకే మాట నిలబెట్టుకోవాలి. వాయిదా వేయరాదు.
6.
వాదనలు చేయరాదు.
7.
వ్యక్తిగత సంబంధములు దెబ్బతినకుండా చూసుకోవాలి.
8.
వ్యాపార నిలకడ కోసం మొత్తం చేతులు మారితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
9.
వీరి సేవ కోసం వచ్చిన వారు అనవసరముగా రెచ్చగొడితే సహనము పాటించాలి.
10.
మీకు నష్టము లేని పద్ధతిలో నిజాయితీగా ఉండండి.
11.
మీ తీరిక సమయములలో సేవా కార్యక్రమంలో పాల్గొని పరిచయమును పెంచుకోండి.
12.
కొన్ని వ్యాపార సంస్థలు రద్దీగా ఉంటే కొన్ని ఖాళీగా ఉంటాయి. దానికి గ్రహబలం కారణమని కొందరు అంటే నిరాశ పడవద్దు వినూత్నమైన అమ్మకం పద్ధతుల గురించి ఆలోచించండి.
13.
దేనికైనా మానవ ప్రయత్నము, నూతన ఆలోచనలు ముఖ్యమని గమనించాలి.
14. మీ
సేవ కోసం వచ్చిన వారికి గౌరవము ఇచ్చి పుచ్చుకోండి.
15.
మీ మాట తీరు మళ్ళీ మళ్ళీ రావాలని అనిపించే విధంగా ఉండాలి.
16.
సమయమును బట్టి పట్టువిడుపులతో అమ్మకము సాగించాలి.
17.
మొక్కుబడిగా షాపులో కూర్చుంటే అమ్మలేరు. మానవ సంబంధములు కూడా ముఖ్యమే.
18.
చౌక రకమైన వస్తువులు కాక నాణ్యత గల వస్తువులు, సేవలు మాత్రమే అందించాలి.
19.
వ్యాపారములలో అభివృద్ధికి వ్యాపార స్థలంలో గాని గల్లా పెట్టెలో కానీ ఇష్ట దైవముతో పాటు పసుపు కుంకుమ రాసిన నిమ్మకాయ, బుధ గ్రహ యంత్రము పెట్టి దానికి అగరుబత్తి రోజూ వెలిగించి నమస్కరించుకుంటే వ్యాపార అభివృద్ధి జరుగుతుందని కొందరు అంటారు.

                       శుభం

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.