Friday, April 14, 2023

నమ్మకము - నాటు వైద్యం

ఇప్పటికీ నాటు వైద్యం మీద నమ్మకం ఉండి, దాన్ని చేయించుకునే వారు కొందరు ఉన్నారు. 

దాని గురించి కొన్ని విషయములు తెలుసుకుందాం.

1. 1960 ప్రాంతంలో ఇంతమంది ఎముకల వైద్యులు లేరు. చిత్తూరు జిల్లా పుత్తూరు గ్రామంలో కొందరు రాజులు ఉండేవారు. వీరిని పుత్తూరు రాజులు అని పిలిచేవారు. వారు వంశపారంపర్యంగా ఎముకల వైద్యం చేసేవారు. వారు ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో ఉండేవారు. ఎముకలు విరిగిన కాళ్ళూ, చేతులకు ఆకుపసరు వైద్యంతో అందుబాటులో ఉండేవారు. అందుబాటు ధరలో వైద్యం చేసి, అందరి పొగడ్తలు పొందేవారు.
2. కుక్క కరిచినప్పుడు రెబీస్ ఇంజక్షన్ అందుబాటులో లేనప్పుడు, కరిచిన చోట రాగి నాణెము, కాకర ఆకుతో కట్టి వైద్యం చేయించుకుంటే తగ్గేది.
3. పూర్వకాలము ప్రమాదకరమైన పచ్చకామెర్లు లేక పసికర్ల వ్యాధి (జాండీస్) వచ్చినప్పుడు గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర ఇంటూరు గ్రామంలో, ఒక ముసలి వ్యక్తి ఎడమ చేతి మణికట్టు మీద
బాగా కాల్చిన ఇనుముతో వాత పెట్టేవాడు. కొన్ని కేసులు ఫెయిల్ అయినా చాలామందికి పని జరిగేది.
4. పూర్వం ఇంటిలో పెద్దలు కాలికి గాయమైతే ఇంట్లో గల ఏడు లేక ఎనిమిది యేళ్ళ  పిల్లల మూత్రమును దానిపై పోయించుకునేవారు. అది యాంటీ సెప్టిక్ గా పనిచేసి గాయము నయమయ్యేది.
5. కొన్ని ఏళ్ళ క్రితము ఒక మాజీ దేశ ప్రధాని తన రోగ నివారణకు సొంత మూత్రపానము స్వీకరణ ప్రకటన సంచలనము కలగజేసింది.
6. కాలికి, చేతికి కొన్ని మార్లు వాపు వచ్చినప్పుడు ఇనుప గరిటతో తాకితే వాపు తగ్గేది.
7. ఈమధ్య వెలుగులోకి వచ్చిన ఒక ఊరిలో  కరోనాకి విరుగుడు నాటు మందు. అందరికీ మేలు జరిగింది. వివాదములకు చోటు జరిగింది.
8. తేలు కరిస్తే చింత గింజ బద్ద దాని మీద పెట్టి కొందరు విషము తగ్గించుకుంటున్నారు.
9. కథల్లో చదువుకునే పాము నెత్తిన మణిని కొందరు సంపాదించి  తేలుకాటుని మణిద్వారా పోగొట్టుకుంటారు. 

నాటువైద్యం ఎక్కడ జరిగినా దాని పూర్తిస్థాయి శాస్త్రీయ విశ్లేషణ, ఉపయోగము లేదా అపకారము పూర్తి వివరము రోగులకు అందితే వారికి ఉపశమనం కలుగుతుంది.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...