ఈ భూమి మీద కొందరు నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. అది నిజం అనుకున్నా ఈ భూమి మీద ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ అందరికీ తెలియవు. తెలిసినవి కొన్ని అయితే, తెలియని విషయములు చాలా ఉంటాయి.
ఉదాహరణకు మెకానిజం అనగా వస్తువులు, యంత్రములు బాగు చేయు సెక్షన్. ఎన్నో మెకానిజములు ఉన్నాయి. అవన్నీ ఒకే వ్యక్తికి రావు. ఒక్కొక్క వస్తువు బాగు చేయుటకు ఒకరు ఉంటారు. అలానే విషయములలో మెకానిజము ఒక భాగము మాత్రమే.
అదే ఒక వ్యక్తికి అన్ని మెకానిజములు రానట్టు ప్రపంచంలోని అన్ని విషయములు ఒక వ్యక్తికి తెలియడం సాధ్యం కాదు. ఇలా ఎవరైనా భూమి మీద అనుకున్నట్లయితే అది ఒక భ్రమతో కూడిన అహంభావము. గర్వము పెరిగి పతనమునకు తప్పక దారితీస్తుంది.
అన్నీ తెలిసిన వ్యక్తి ఈ భూమి మీద ఒకరు ఉండవచ్చు. అది ఈ సృష్టి మరియు ఈ సృష్టిలోని విషయముల నిర్మాతగా భూమి మీద మనకు కనపడని అదృశ్య, అలౌకికవ్యక్తి అవ్వచ్చు.
కనుక ఎవరైనా నాకు అన్నీ తెలుసు అని భావించే భ్రమలో ఉంటే ఆ భ్రమను వీడి బయటికి రావాలి. ఇంతెందుకు అవధాన ప్రక్రియలో పాల్గొనే అవధానకర్తలకు తెలియని విషయములు ఉంటాయని మనం గమనించాలి.
జ్ఞానవంతులైనవారు అహంభావమునకు చోటు ఇవ్వకుండా ఒదిగి ఉండాలి. ఎంత విద్యావంతులైనా,వారి జ్ఞానము వృత్తి, వ్యాపార, అధికార విషయముల వరకే పరిమితం అని గమనించాలి.
No comments:
Post a Comment