Tuesday, March 28, 2023

యాచకులకు సహాయం చేయుట

మానవ జీవితంలో సహాయం అన్న మాట అనేక సందర్భములలో అవసరం అవుతుంది. సహాయములో రెండు రకములు ఉన్నాయి. 

సహాయం చేయడము, సహాయం పొందటము. యాచకులను ఆదరించుట సహాయం చేయడంలో భాగంగా అనుకోవచ్చు. 

యాచకులను ఎలా ఆదరించాలో చూద్దాం. మన సహాయం కోరి వచ్చిన యాచకుని చులకనగా చూడరాదు. కసురుకోవటము కానీ, విసుక్కోవడం కానీ చేయరాదు.

సాయిబాబా జీవిత చరిత్ర ద్వారా ఈ క్రింది విషయములు తెలుసుకోవచ్చు. నానా చందోర్కర్ తన ఇంటికి వచ్చిన భిక్షురాలిని తన నౌకరు ద్వారా గెంటించడం తప్పని, అలాగే ఆహారం కోసం వచ్చిన కుంటి కుక్కను కొట్టడం తప్పని మందలించడం ద్వారా మనకు పద్ధతి నేర్పారు.

మనం చేసే ధన సహాయము భిక్షకులకు మనం ఇచ్చే చిన్న మొత్తము. అది వారి జీవిత గతిని మార్చదు. అంత మాత్రము చేత మనము దాని గురించి ఎక్కువగా ఊహించుకోరాదు.

ఈ విషయంలో ఒక పేపర్ వార్త తెలుసుకుందాం. ఒక దేవాలయం ముందు కూర్చున్న ఒక బిక్షగాడు అదే దేవాలయమునకు అనేక విరాళాలు ఇచ్చాడు. అతని దాన సహాయం నిజంగా మెచ్చుకోదగినది.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...