మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తలు పాటించి ఆనందంగా ఉండండి. మనకు అందుబాటులో కల అన్ని రకాల ఆహార పదార్ధములు మన ఎదురుగా ఉన్నప్పుడు, నోరు కట్టుకోలేక జిహ్వచాపల్యంతో ఆపదార్థములు తిన్నప్పుడు అదుపులో లేని మధుమేహ వ్యాధితో చిక్కుల్లో పడే సందర్భములు ఉంటాయి.
అలవాటైన పదార్థముల మీద వ్యామోహము ఎన్ని చెప్పినప్పటికీ, తొందరగా తగ్గదు. అంతేకాక అది ఒక రోజుతో అయిపోయే విషయం కాదు. దానిని జీవితకాల పర్యంతం తినకుండా ఉండాలంటే కష్టము.
చక్కని ఆహార నియమములు పాటిస్తూ, తినదగిన పదార్థములు కేలరీల లెక్కన తింటూ, తినకూడని పదార్థములు ఒక చిటికెడు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు అతిగా తిని ఇన్సులిన్ కోటా లేక మాత్రలు పెంచుకునే అవసరం ఉండదు. అంతేకాక, వ్యాధి తీవ్రతతో మన శరీరము అవయవములకు కలిగే నష్టాన్ని తప్పించుకోవచ్చు.
కనుక వీటిని గుర్తు ఉంచుకుంటూ ఆహారపు క్రమశిక్షణను పాటించాలి. మనము తీసుకునే మందులు లేక ఇన్సులిన్ తో పాటు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పచ్చి మెంతుల పొడి (వేయించనవసరం లేదు) ఒక టీ స్పూను రోజుకు రెండు మార్లు పొద్దున, రాత్రి పడుకోబోయేటప్పుడు వాడి మీ వ్యాధిని అదుపులో ఉంచుకొని ఆనందం పొందండి.
ఇది జీవిత సత్యం. వాడిన వారి అనుభవం, ఆనందం మీతో పంచుకునే విషయం అని తెలుసుకోండి. చివరగా మందులు, ఇన్సులిన్ వాడండి. మందులు వాడటం మానవద్దు. ఆహార నియమములు తప్పక పాటించండి.
No comments:
Post a Comment