Monday, March 20, 2023

పురాణ కథలు - సూర్య, వాయువులలో ఎవరు గొప్ప

ఒకానొకప్పుడు వాయువుకు, సూర్యునికి ఎవరు గొప్ప అను వాదన జరిగింది. అది తేల్చుకొనుటకు దారిన పోతున్న ఒక కోటు ధరించిన బాటసారిని చూసి, ఎవరు అతని కోటు విప్పించగలిగితే, వారు గొప్ప అని నిర్ణయించుకున్నారు.

మొదట వాయువు ప్రయత్నించాడు, విపరీతమైన గాలి తాకిడికి ఆ బాటసారి కోటును జరిపోకుండా, మరింత గట్టిగా పట్టుకున్నాడు. 

వెంటనే సూర్యుని ప్రయత్నం మొదలైంది. విపరీతమైన ఎండ వేడిమికి బాటసారి కోటును తీశాడు. ఎవరు గొప్ప అని తేలినప్పటికీ, సైన్స్ ప్రకారం చూస్తే, సూర్యుడు కానీ, వాయువు కానీ ప్రకృతి శక్తులకు ప్రతీకలు. వారి ఉనికిని ఎవరూ కాదనలేరు. 

వాయువు గాలితో పాటు అందించే ఆక్సిజన్ జీవకోటికి ప్రాణాధారం. ఆక్సిజన్ లేనిదే మానవకోటి మనుగడ లేదు. ఆక్సిజన్ అందక గడచిన రెండు లేక మూడేళ్ళలో ఎంతోమంది తమ జీవితాలను కోల్పోయారు. శాస్త్రము ప్రకారం వాయువు ఒక దిక్కుకు అధిపతి. వాయు పుత్రుడు  హనుమంతుని పూజిస్తే ఆరోగ్యం ఉంటుంది.

సూర్యుడు ఒక గ్రహము.  సూర్యరశ్మి లేనిదే ప్రాణికోటి పెరగదు. సూర్యరశ్మిలోని డి విటమిన్ ఎముకలకు పుష్టి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహములకు నాయకుడు, అధిపతి.

సూర్యదర్శనం కానిదే, సూర్యారాధకులు భోజనం చేయరు. ఆరోగ్య గ్రహీత. మానవకోటికి మనుగడకు సూర్య, వాయువులు ఇద్దరూ ముఖ్యమే.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.