కోపం వలన ఎన్నో నష్టాలున్నాయి. దీనికి సంబంధించి పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. వాటిలోనుండి రెండు కథలను ఇప్పుడు చూద్దాం.
1. పరీక్షిత్తు అనే రాజు ఉండేవాడు. ధర్మపరుడు. ఒకరోజు అడవికి వేటకు వెళ్లి అలసిపోయి సమీపంలోని ముని ఆశ్రమమునకు వెళ్ళాడు. అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ ఇతన్ని గమనించలేదు. అలసిపోయిన రాజు కోపంతో పక్కనే చచ్చి పడి ఉన్న పామును తీసి ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు.
కొంతసేపటికి ముని కుమారుడు వచ్చి ఈ పని చేసిన రాజు ఎవరని వివరము తెలుసుకుని, ఆ రాజు వారం రోజుల్లో సర్పం యొక్క కాటుతో మరణించునని శాపం ఇచ్చాడు. ఈ శాపం అమలు జరుగుటకు ఒక నాగుపాము బయలుదేరి మార్గమధ్యంలో ఒక మంత్ర శాస్త్రవేత్త ఎదురుపడితే అతను రాజుని బతికించడానికి వెళ్లినట్టు తెలుసుకొని అతనిని వెనకకు పొమ్మని పంపించేశాడు.
ఈ లోపల రాజు శాప భయముచే సముద్రము మధ్యలోకి వెళ్లి దేవుడి విషయములు వినుట మొదలుపెట్టాడు. అయినప్పటికీ నాగు పాము కాటు వల్ల రాజు మరణించాడు. ఇది జరిగిన తరువాత రాజవంశములో ఒక వ్యక్తి పాము మీద కోపంతో సర్పమును చంపుటకు గొప్ప యాగము చేసాడు. చాలా సర్పములు చనిపోయాయి. ఆ తర్వాత దైవజోక్యముతో యాగము ఆపినారు. కొన్ని పాములు బతికినవి. దీనిని చర్య - ప్రతి చర్యలుగా చూడవచ్చు.
2. ఒక రాజు అడవికి వెళ్లి అలసిపోయి ఒక ముని ఆశ్రమమునకు వెళ్లి ముని ఆతిథ్యము స్వీకరించాడు. ఆ అతిథి చర్యలకి కోరికలు తీర్చే ఒక ఆవు కారణమని తెలుసుకొని ఆవుని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు.
తరవాత వచ్చిన ముని కుమారుడైన పరశురాముడు జరిగిన విషయము తెలుసుకుని ఆ రాజుపై దండయాత్ర చేసి ఆవుని విడిపించాడు. అయినా కోపం తగ్గక అనేక రాజులపై దండయాత్ర చేసి వారిని సంహరించాడు.
No comments:
Post a Comment