Saturday, March 11, 2023

జీవితంలో విజయానికి సోపానములు - ఓర్చుకొనుట, నేర్చుకొనుట

ఎవరి జీవితంలోనైనా విజయములు, ఓటములు ఉంటాయి. ఆ మాటకొస్తే ఓటములు ఎక్కువగా ఉండవచ్చు. ప్రతి ఓటమిని ఓర్చుకోవాలి. 

ఆ ఓటమికి కారణములు విశ్లేషించుకోవాలి. దాని నుంచి పాఠములు నేర్చుకోవాలి. అదే విజయానికి తొలి మెట్టు అవుతుంది. ఈ రెండు విషయములు కలిసే ఉంటాయి. దానిని అలవర్చుకున్న వారికి విజయం సొంతం అవుతుంది. మీ విశ్లేషణలో  ఓటమికి కారణములు ధనబలము, అధికారబలము అని తేలితే ఈ కాలం పరిస్థితుల్లో అవి తిరుగులేని శక్తులు. 

మీ మెదడుకు బాగా పదును పెట్టి మీ బలము అంచనా వేసుకుని తగిన ప్రయత్నములు చేసి విజయానికి ప్రయత్నించాలి. కానీ వెనకడుగు వేయరాదు. అప్పుడే మీరు విజయమునకు దగ్గరగా చేరుతారు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే విజయం సాధించిన వారు మొదటి ప్రయత్నంలో కాక అనేకమార్లు ప్రయత్నించి విజయం సాధించినవారు ఉన్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు గూడు పాడైనా దాని నిర్మించే సాలీడు మనకు ఆదర్శము.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.