ఈమధ్య ఒక ఆయనను కలిసినప్పుడు, నేను ఉద్యోగంలో స్వయంకృషితో ఎదిగి, మా శాఖా వ్యవస్థలో ఉన్నత పదవిలో పనిచేసి విరమణ చేశాను. పిల్లలకు మంచి చదువులు చెప్పించాను.
వారు ఉద్యోగములలో అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డారు. విరమణ తర్వాత కొన్ని ఏళ్ళ క్రితం కొన్న స్థలములో పొదుపుతో, బ్యాంకు అప్పుతో స్వగృహం ఏర్పాటు చేసుకొని కొంత అద్దెరూపంలో ఆదాయము, పెన్షనుతో సంతృప్తిగా గడుపుతున్నాను. నా పనులన్నీ నేను స్వయంకృషితో ఏర్పాటు చేసుకుని తృప్తిగల జీవితం గడుపుతున్నానని చెప్పారు. నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు, తక్కువ కోరికలతో సంతోషంగా ఉన్నానని చెప్పారు.
ఈరోజులలో అందరూ అలా తృప్తిగా గడపాలంటే ఏమి చేయాలి? మనకు వచ్చే ఆదాయంలో భేషజాలకు, వృధా ఖర్చులకు పోక జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంటిలో అనారోగ్యం నిమిత్తము వైద్య ఖర్చులు, పిల్లల చదువు నిమిత్తము విద్యా ఖర్చులు, వాటి వలన కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు.
అందరూ అనుకున్నట్లు కొందరికి గాడ్ ఫాదర్ ఉండవచ్చు. వారి సహాయంతో జీవితము వడ్డించిన విస్తరిగా ఉండవచ్చు. కొందరికి అయితే ఉద్యోగ స్థానంలో కోరినచోటికి బదిలీ దొరకవచ్చు. అయితే అందరికీ గాడ్ ఫాదర్లు ఉండరు.
గాడ్ ఫాదర్లు లేరని బాధ పడవద్దు. వారికి ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇస్తే పని చేసే పెట్టే ఏజంట్ల వ్యవస్థ ఉంది. వారికి తగిన రుసుము చెల్లిస్తే ఏ వ్యవహారం అన్నా పూర్తి చేయవచ్చు. ఉదాహరణకు కొత్తగా ఊరు బదిలీ అయినపుడు, తగిన రుసుముతో అద్దెకు ఇల్లు ఏర్పాటు చేయగల వ్యక్తులు ఉంటారు. ఈ వ్యవస్థలోని వ్యక్తులు దైవదర్శనం నుండి మనకు కావలసిన దైనందిన పనులు ఏవైనా చేయించగలరు.
గాడ్ ఫాదర్ లేరని బాధపడే వ్యక్తులకు ఒక చిన్న సూచన. మీరే కొందరికి గాడ్ ఫాదర్లా మారండి. మీ చేతనైన సహాయము ఇతరులకు చేయండి. పరిచయములు పెంచుకొనండి. మీకీ గుర్తింపు వస్తే, మీ పనులు తేలిగ్గా పూర్తవుతాయి.
నీతి: ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా దొరకదు. ఈ ప్రపంచమును నడిపించే శక్తి భగవంతడని కొందరు, డబ్బు అని మరికొందరు, మానవ స్వభావము, మేధస్సు అని ఇంకొందరు - ఇలా విభిన్న అభిప్రాయములతో నడిచేదే ఈ ప్రపంచం.
No comments:
Post a Comment