మనిషి ఎంత కాలం జీవిస్తాడో తెలియజెప్పే విషయం ఆయుర్దాయము అనుకుంటే, ఏ మనిషి ఎంత కాలం జీవిస్తాడో ఎవరూ నిర్ధారణగా చెప్పలేరు. అది మనిషికి దేవుడికి మధ్య ఉన్న రహస్యమే.
జ్యోతిష్యవేత్తలు ఎంత పండితులైనప్పటికీ రకరకాల లెక్కలు, కారణములు, ఏ గ్రహము ఎవరికి మరణమిచ్చునో అన్నవి వివాస్పద వ్యవహారములైనందున ఆయుర్దాయ నిర్ణయము సరిగా తేలదు. మనిషి జీవించి ఉన్నంత కాలంలో ఏ కారణం చేతనైనా ప్రమాదములతో మరణం సంభవించవచ్చు.
ఏ వయసు వారైనా చిన్నవారైనా, పెద్దవారైనా ముందు వెనకలు ఉండవచ్చు. కానీ జీవించి ఉన్నంత కాలము ప్రతి మనిషి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వారి ఆత్మీయులకు మేలు. తమ పేరిట ఉన్న ఆస్తి వివరములు తగిన వారసత్వపు హక్కుతో రిజిస్టర్ చేయట మేలు. అలా కాని పక్షంలో వారసులు న్యాయపరమైన ఆస్తికి హక్కులకై తగిన పత్రముల కొరకు సమయము వృధా అవుతుంది. డబ్బు ఖర్చు చేయాల్సివస్తుంది.
ఈ చర్యల్లో భాగంగా ప్రత్యేకించి బ్యాంకు ఖాతాలు ఉన్నవారు నామినేషన్ తప్పక తెలియపరచుకోవాలి. తమ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ వివరములు కూడా తమ వారికి తెలియజేయాలి. తమ ఆస్తి మీద గల వివాదములు ఏమైనా ఉంటే ఆత్మీయులకు, వారసులకు తెలియజెప్పడం మర్చిపోరాదు. కాలచక్రంలో ఒకరోజు గడిచినప్పుడు తమ జీవిత లెక్కలో ఒకరోజు తగ్గిందని తెలుసుకున్న వారిని కాలతత్వము అర్థం చేసుకున్న వ్యక్తిగా అనుకోవచ్చు.
దీర్ఘాయుష్మాన్ భవ లేక శతాయుష్మాన్ భవ అని పెద్దవారి నుండి ఆశీర్వాదం అందుకుందాం.
No comments:
Post a Comment