Sunday, February 5, 2023

సాధన

సాధన అనగా ఒక పనిని సాధించడానికి చేసే ప్రయత్నంగా అనుకుందాము. సాధనకు ఏకాగ్రత ముఖ్యము. ఏకాగ్రత సాధనలో ధ్యానము చేయాలి.

దానికి కొన్ని రకమైన ప్రయత్నములు, కొన్ని రకమైన ధ్యానములు అవసరము. దీపము చూస్తూ చేసే విధము, శ్వాస మీద దృష్టి నిలపటం, కొన్ని మంత్రాలు ఉచ్చరిస్తూ చేయుట, దైవం యొక్క ఆకార నిరాకార రూపములు చూస్తూ చేసేవి - ఇలా అనేక రకములు ఉన్నాయి.

ధ్యానం చేస్తే ఎంతో కొంత ఉపయోగము జరుగుతుంది. సందేహపరులు కోయంబత్తూర్ లోని వేలాంగణి అనే ఊర్లోగల జగ్గీ వాసుదేవ్ గారిచే నిర్మింపబడిన ఆధునిక ధ్యాన కేంద్రంలో ధ్యానము చేసి, కొన్ని సందేహములు తీర్చుకోవచ్చు. 

ఈ విషయంలో భారతంలోని ఒక కథను జ్ఞాపకం చేసుకుందాం. ఇది ద్రోణుడు కురుపాండవులకు విలువిద్య నేర్పే సమయంలో జరిగిన సంఘటన. ద్రోణుడు ఒక చెట్టును చూపించి, అర్జునుడిని దానిపైన ఉన్న ఒక పక్షిని చూడమన్నాడు. అర్జునుడు తనకు ఆ పక్షి తప్ప ఏమీ కనబడట్లేదు అని చెప్పాడు. అతని ఏకాగ్రతను మెచ్చుకున్న ద్రోణుడు మిగిలిన వారిని ప్రశ్నించి, వారిచ్చిన జవాబులతో, వారి ఏకాగ్రతలో తేడా ఉందని గమనించాడు. ఏకలవ్యుడు ఏకాగ్రతతో గురు పరోక్షములో సాధన చేసి విలువిద్య నేర్చుకొనడం ఒక విశేషము.

ఈసందర్భంలో శాపములు ఇచ్చుట గురించి తెలుసుకుందాం. జూదములో ఓడిపోయిన తర్వాత, ద్రౌపదీ వస్త్రాపహరణము జరిగిన తర్వాత, ద్రౌపది వారిని శపిస్తానని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు వారించి, ఆమెకు ఒక వరం ఇస్తానని చెప్పడం మహాభారతం ద్వారా మనకు అర్థమవుతుంది. శాపశక్తి కొంతకాలమునకు తగ్గిపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు.

అందుబాటులో ఉన్న అన్ని వందల ధ్యానముల నుండి మనకు తగినది మనము ధ్యానము చేయవచ్చు. ఏకాగ్రత దొరికినప్పుడు, తద్వారా ఆలోచన నిలకడగా ఉండి, కోపము, బీపీ తగ్గి ఎక్కువ కాలం జీవించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు మన చుట్టూ ఉన్న ఆకర్షణీయ ప్రలోభాల నుండి కాపాడి మన అలవాట్లను సమతుల్యముగా ఉంచుతాయి. 

ఒక ఊరిలో ఒక ధ్యాన శిక్షణా తరగతులు జరుగుతున్నప్పుడు, వాటిని చూద్దామని వెళ్ళినప్పుడు, ఆ ధ్యాన వ్యవస్థాపకుడు స్టేజి మీద కూర్చున్న ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ఒక ఆడ మనిషిని ఉద్దేశించి నీవు గత జన్మలో కొన్ని వందల ఏళ్ళ క్రితం ఉన్న ఒక మహాయోగి భార్యవు, ఈ జన్మలో ఈధ్యాన కేంద్ర మండలిలో పదవిలో ఉన్నావు అని అన్నాడు. ఆ మహాయోగి భార్యకు ఈ ధ్యానమండలి పదవి ఎక్కువో, తక్కువో, సమానమో నాకేమీ అర్థం కాలేదు. ధ్యానుల మాటలు అందరికీ అర్థం కావని నేను అనుకున్నాను.

నీతి: మీ సాధనలో మీకు మానవాతీత శక్తులు వస్తే వాటిని దుర్వినియోగం చేయవద్దు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.