మన హృదయపూర్వక పలకరింపు అవతలి వ్యక్తికి సంతోషం కలగజేయాలి. మన ఇంటికి ఎవరైనా వచ్చిపనప్పుడు, ఆప్యాయత, చిరునవ్వుతో కూడిన పలకరింపు లేదా ఆహ్వానము అవతలి వ్యక్తికి తప్పక సంతోషం కలిగిస్తుంది.
కొందరు చాలా ముక్తసరిగా ఆహ్వానిస్తారు.దాని కంటే చిరునవ్వుతో ఆహ్వానించే విధానము తప్పక మెరుగే మరియు చెప్పుకోదగినది. పిలుపులలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి.
కొందరు అవతలి వ్యక్తికి శుభలేఖ ఇచ్చి, పెళ్ళికి వారిని రమ్మని పిలుస్తారు. మరికొందరు శుభలేఖ ఇచ్చి, అదే పిలుపుగా భావించి, అవతలి వారిని రమ్మని ఆహ్వానించడం మర్చిపోతే, అవతలివారు నొచ్చుకుంటారు.
ఒక పిలుపులో తేడా వచ్చిన యదార్థగాధ తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక రైతు గ్రామంలోని ఒక ఆర్థిక సంస్థ ద్వారా ట్రాక్టర్ రుణం తీసుకున్నాడు. దానికి హామీగా తన చెల్లెలు భూమి కూడా తాకట్టు పెట్టి తీసుకున్నాడు, దానిలో కొంత పొరపాటు జరిగింది.
తరువాత ట్రాక్టర్ రైతు తన బంధువులతో కలిసి, దగ్గరలో గల దైవదర్శనం యాత్ర చేస్తూ, తన బావమరిదిని, చెల్లిని తనతోటి రమ్మని పిలవడం మర్చిపోయాడు. కోపం వచ్చిన బావమరిది అన్ని ప్రయత్నములు చేసి ఆ ట్రాక్టర్ అమ్మి రుణం తీర్చే విధంగా ఒత్తిడి చేశాడు. తప్పని పరిస్థితిలో రైతు అప్పు తీర్చి ఒడ్డునపడ్డాడు. ఇది పిలుపులోని తేడా.
రోగగ్రస్తుడు తమ బంధువులు, స్నేహితుల నుండి ఓదార్పు, ఆప్యాయతతో కూడిన మాటలు, ఆదరణ కోరుకొనుట సహజం. ఒక మంచిమాట వారికి కోలుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ఒక వ్యతిరేకమైన మాట వారి మనసుని బలహీన పరుస్తుందని మరవరాదు. మానవ సంబంధములలో పలకరింపు, పిలుపు చాలా చెప్పుకోదగిన పాత్ర వహిస్తుందని గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment