Monday, January 30, 2023

నేరము - శిక్ష

కొన్ని ఏళ్ళ క్రితము కొందరు అయ్యప్ప భక్తులు బస్సులో అయ్యప్ప యాత్రకు వెళ్ళారు. ఒక ఊరి బయట పొలాల దగ్గర ప్రకృతి కార్యక్రమానికి బస్సుని ఆపారు. 

భక్తులు బస్సు దిగిన తరువాత ఒక భక్తుడు పొలంలో వేరుశనగ పంటను చూసి, వేరుశనగ మొక్కను పీకి, వేరుశనగ కాయలు తిన్నాడు.  అతన్ని చూసిన మిగిలిన మరికొందరు అదేవిధంగా చేయసాగారు. ఆ పొలంలోని కొన్ని మొక్కలు పీకబడ్డాయి. ఇది తెలిసో, తెలియకో చేసిన ఆకతాయి చర్యగా మనం అనుకుంటే, దాని పర్యవసానం అనుభవించేవాడు ఆ పొలం యజమాని గాని, కౌలుకు తీసుకున్న రైతు గాని అవుతాడు. 

మొక్కకు రూపాయి చొప్పున వేసుకున్నా, అతనికి జరిగిన నష్టం కొన్ని వందల్లో ఉండవచ్చు. అంటే ఇక్కడ తప్పు ఒకరు చేస్తే, శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు. ఇక్కడ శిక్ష అంటే, ఆర్థికంగా నష్టపోవడం. అదే ఆ పొలమునకు కాపలాదారుడు ఉంటే వాదన జరిగి, హింస లేక ప్రతీకార చర్యకు దారి తీయవచ్చు. 

వేరుశెనగ చెట్లు పీకి, నష్టం కలగజేసిన వారిని ఎవరూ చూడలేదు కనుక ఏ గొడవ లేదు. ప్రకృతి ధర్మం ప్రకారం అతనికి కలిగిన నష్టం ఎలా పూడుతుంది? అంటే బాధితుడికి ఊరట లేక ఆర్థిక అండ. 

ఇది చూసిన తర్వాత నాకు చిన్నప్పుడు చదివిన ఒక కథ  జ్ఞాపకం వచ్చింది. ఒక ఊరిలో కొన్ని కోతులు ఉన్నాయి. అవి అడవిలో తిరుగుతూ ఒకసారి మేకులు కొట్టిన దుంగలను చూశాయి. అవి వడ్రంగి వాళ్లు దుంగలు పగలగొట్టుటకు కొట్టిన మేకులు. కోతులు ఉత్సాహంగా దుంగల్లోని మేకులు పీకడం మొదలుపెట్టాయి. మేకులు తీసే సందర్భంలో ఆ చీలికలలో కోతుల కాళ్ళు పడిపోయి, కొన్ని చనిపోయాయి. 

నీతి: గుంపు మనస్తత్వంలో ఆకతాయి పనులు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  ఏ ఒక్కరు తప్పు చేసినా, అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఇక్కడ గుంపు అంటే ఒక్కరి కంటే ఎక్కువ అని అర్థము.  విచక్షణతో నేర నివారణలో చట్టమునకు సహకరించండి, అదే మనము చేయగలిగిన సమాజ సేవ.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...