Monday, January 30, 2023

కొన్ని అభిప్రాయములు - సమాజమునకు ఉపయోగపడే నిజములు

1. కొందరు మగపిల్లలు తమతో కలిసి ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల కంటే ఎప్పుడో వచ్చి పోయే కూతురు పిల్లలను ఎక్కువ ప్రేమగా చూస్తారని అనుకుంటారు.

2. కొన్ని ఏళ్ళ క్రితం ఆడపిల్ల పుడితే కష్టమని అనుకునే తల్లిదండ్రులు అభిప్రాయం మార్చుకుని, ఆడపిల్ల మాఇంటి మహాలక్ష్మి అనే విధంగా పరిస్థితులు మారిపోయినాయి.

3. చాలామంది మగపిల్లలు డిగ్రీతో చదువు ఆపివేస్తే, ఎంతోమంది ఆడపిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు చదువుతున్నారు.

4. మగపిల్లల కంటే ఆడపిల్లలు తమ పట్ల ఆప్యాయత, ఆదరణ చూపిస్తారని తల్లిదండ్రులు అనుకుంటారు.

5. సంసారంలో భార్యాభర్తలను బండికి రెండు చక్రాలుగా భావిస్తే,  ఆ రెండు చక్రాలను కలిపే చెక్కలో కల్తీ స్వభావం వలన విడాకుల సంఖ్య పెరిగింది.

6. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులైతే, ఇంటి పనిలో సహకరించే భర్త ఉన్న భార్య సంతోషపడితే, భర్త  తనకు సహకరించని భార్య అసంతృప్తిగా ఉండవచ్చు.

7. ఆహారం బాగా నమిలి తినాలని చిన్నప్పుడు చదువుకున్నవారు పెద్దయిన తర్వాత ఎక్కువసేపు ఆహారమునకు,  స్నానమునకు సమయం కేటాయిస్తే, ఇల్లు దాటిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడతారు.

8. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం కాకుండా, ఇద్దరు ఉన్నప్పుడు ఇతరులతో పంచుకునే స్వభావం ఉంటుందని ఎక్కువమంది అనుకుంటారు.

9. ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ లాభపడేదీ, నష్టపడేదీ ఆడవారు మాత్రమే.

10. క్షమా గుణము బయటికి రావాలంటే అవతలివారు మనకు చేసిన నష్టము లేక కోపకారణము తగ్గాలి.

11. కుటుంబ వ్యవహారంలో ఏ విషయం ముందుకు పోవాలన్నా  అడవారి సహకారం ముఖ్యము.

12. అన్ని ప్రమాదములు చెప్పి రావు. తృటిలో జరిగేది ప్రమాదము.  మన తప్పు లేకపోయినా, అవతలి వ్యక్తి వలన కూడా ప్రమాదములు జరుగుతాయి. 

13. ఒకరి పుట్టింటిని మరొకరు విమర్శించుకునే భార్యాభర్తల కుటుంబము కోపతాపాలకు లోనయ్యి, తొందరగా బజారున పడుతుంది.

14. అందమైన పాలిష్ బియ్యం వలన  కంటివ్యాధులు, ఆధునిక టూత్ పేస్టు వాడటం వలన పంటి వ్యాధులు వస్తాయనే అభిప్రాయం చాలా మందికి ఉంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.