Saturday, January 21, 2023

జీవితంలో ఏమి కావాలి

అందరికీ అన్నీ కావాలి. కానీ అమరవు. లోటు లేని జీవితం ఉండదు. సగటు మనిషి ఏమి కావాలనుకుంటాడో చూద్దాం. 

జన్మించిన తర్వాత పెరిగి పెద్దవారై, విద్య పూర్తయిన తర్వాత వృత్తి ద్వారా ఆర్థిక వనరులు ఏర్పరచుకొని, వివాహమై పిల్లలు కలిగిన తర్వాత అనుకూలమైన భార్య, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో చిన్నప్పుడు తాను కాన్వెంట్, యూనిఫాంలతో చదవలేదని కొందరు తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చేరుస్తారు. 

అధికఫీజులు తట్టుకోలేనివారు కొన్ని త్యాగములతో పిల్లల చదువులు పూర్తి చేస్తారు. దానికి తగిన ఉద్యోగము లేదా ఆదాయమార్గము ఉండాలని కోరుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులైతే పెద్దగా ఆర్థిక సమస్యలు బాధించవు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే వారిని డబల్ ఇన్కమ్ గ్రూపు లేదా డిఐజి అని ముద్దుగా వ్యవహరిస్తారు. 

కొంత జీవితకాలము గడిచిన తర్వాత స్వంతగూడు ఏర్పరచుకుంటారు. కొందరు బ్యాంకు రుణం ద్వారా ఏర్పరచుకుంటే, మరికొందరు చిరుద్యోగులు, వ్యాపారులు కొంత వయసు వరకు గూడు ఏర్పరచుకోలేకపోతారు. ప్రతివారూ అందమైన బంగళాను చూసి ముచ్చటపడినప్పటికీ, చాలామంది మూడు గదుల ఇంటితో సరిపెట్టుకుంటారు. ప్రభుత్వం ఇచ్చే గృహ వసతి చాలామంది సామాన్యులకు ఊరట కలిగిస్తుంది. 

రోడ్డు మీద ఉండే నిరాశ్రయులు నిలువ నీడ లేక, ఆకలి తీరక, ఎండా, వాన, చలికి రక్షణగా కనీస వస్త్రములు కావాలని చాలామంది కోరుకుంటారు.

సామాన్యులు వారి పిల్లల విద్యాభ్యాసం తర్వాత, వారికి విదేశములలో ఉద్యోగం దొరికినప్పుడు విదేశీ మారకంలో తేడా వలన వారి ఆర్థిక పరిస్థితి పెరిగి, సామాన్యుల నుండి ధనికులకు మారుతారు. 

అన్ని రకముల మెకానిజములు చేయువారు, రిపేరు చేయువారు,  వ్యాపారములు చేయువారు, వారి అభివృద్ధికి వారితో పని పడినవారు, కస్టమర్లు ఎక్కువ మంది వచ్చి ఆదాయం పెరగాలని కోరుకుంటారు.

ఉద్యోగస్తులు వారి ఉద్యోగంలో ఉన్నత పదవులు వచ్చి, వారికి తగిన గుర్తింపు, మర్యాద, పలకరింపు ఉండాలని అనుకుంటారు. కొందరు కోరిన చోటికి బదిలీ కావాలని కోరుకుంటారు. పారిశ్రామికవేత్తలు వారి వస్తువులకు తగిన గుర్తింపు ద్వారా, అధిక ఆదాయం కోరుకుంటారు. రాజకీయంలో ఉండేవారు మంచి రాజకీయ పదవులు లభించాలని, ప్రజలలో పేరు, పదవీకాలంలో వెన్నుపోట్లు లేకుండా పదవీకాలంలో సజావుగా కొనసాగాలని కోరుకుంటారు. కళాకారులు, క్రీడాకారులు వారికి తగిన ప్రోత్సాహము, ఆదాయము, కీర్తి కోరుకుంటారు.

ఈ భూమి మీద పుట్టిన వారందరూ సొంత ఇల్లు, ఆహారము, వస్త్రములు, పిల్లలకు మంచి విద్య, ఉద్యోగం, ఆరోగ్య సదుపాయము, ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం, కుటుంబ సౌఖ్యము కోరుకుంటారు. కానీ తృప్తి, మనశ్శాంతి, మంచి ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యమునకు మించినవి ఏవీ లేవు. ఇవి అందరికీ దొరకవు. దొరకనివారికి ఏదో లోటు ఉంటుంది. అందరికీ అన్ని అమరాలనీ, లోటు లేని జీవితం దొరకాలనీ ప్రార్థిద్దాం.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.