Tuesday, December 27, 2022

అనుబంధములు - తాతలతో మనుమలు, మనుమరాళ్ళ సంబంధం

ఉమ్మడి కుటుంబంలో కొడుకుల తరం తర్వాత మనుమలు, మనుమరాళ్ళు చదువులు అయిపోయి, వివాహములు, ఉద్యోగముల ద్వారా వేరే ఊర్లో ఉండటం జరుగుతుంది. సెలవులు, పండుగలు వచ్చినప్పుడు తాతగారి దగ్గరికి వెళ్ళాలని, తల్లిదండ్రులతో కలిసి ఉన్న మనుమలు తర్వాత ఆ పల్లెటూర్లకు వెళ్లేవాళ్లు.

అక్కడ ఉన్నన్ని రోజులు వారి జిహ్వచాపల్యమునకు తగిన విధంగా, ప్రేమ ఆప్యాయతలతో అక్కడ అందించే పిండివంటలు, కాలక్షేపం కలిగించే చోట్లు, ప్రకృతి సౌందర్యంతో కూడిన విహారాలు, ఆటపాటలు వారికి మధురస్మృతులుగా మిగిలిపోతాయి. 

కాలం మారింది. ఎన్నో చోట్ల తాతల ఇళ్ళకు వెళ్ళలేని పనుల ఒత్తిడి. సగం ఉమ్మడి సంస్కృతిగా మిగిలిపోయిన కుటుంబాలలో తాతలతో ఉండేది, గడిపేది ఎక్కడ? అందువలన తాత, అమ్మమ్మ, నాయనమ్మల వంటి పెద్దల మనసులో అసంతృప్తి. పైగా వారిలో ఒకరు మరణిస్తే, మిగిలి ఉన్నవారికి అది ఇంకా పెద్ద లోటు. ఒంటరితనం వారిని ఇబ్బంది పెడుతుంది. 

మనుమలు, మనుమరాళ్ళు పెద్దవారితో కలిసిపోయి, క్యారమ్స్, చెస్, అష్టాచెమ్మా వంటి ఇండోర్ గేమ్స్, లేదా కాలినొప్పిలేని పెద్దవారితో అయితే క్రికెట్ లాంటి బయట ఆడే ఆటలు వారితో ఆడి, వారికి మధురస్మృతులుగా అందించవచ్చు.  

అలా కాకుండా, అక్కడకు వెళ్ళినా కూడా పెద్దవారితో గడపకుండా, మన అలవాట్లలో భాగంగా ఎక్కువ కాలము సెల్ ఫోన్ వాడటం, కంప్యూటర్ వాడకం వల్ల యాంత్రిక బంధములు పెరిగి, ఆత్మీయ బంధం తగ్గుతుంది. పెద్దవారు రోగగ్రస్తులు అయితే వారిని పరామర్శిస్తే, అది వారికి మానసిక స్థైర్యమును కలిగిస్తుంది. 

ఒకటో తరం వారికి మూడవ తరం వారి ప్రవర్తన అత్యంత మానసిక బలం ఇస్తుంది. నేడు సమాజంలో తగ్గింది ఈ బంధమే. అదే ఆనందపు బంధము నేడు అవసరం.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...