Tuesday, December 27, 2022

వాడి పారేయుట (యూజ్ అండ్ త్రో)

ప్రపంచంలో అనేకమంది బాధపడే విషయాలలో ఇది ఒకటి. చాలామంది తమని అవతలి వ్యక్తులు ఎన్నో పనులకు ఉపయోగించుకొని, అవసరం వచ్చినప్పుడు సహాయం చేయలేదని, వారి అవసరానికి వాడుకుని అవతల పారేసినట్లు తమకు జరిగిందని అనుకుంటారు. 

ఇలా నిజజీవితంలో ఎందరో అనుకోవటం మనం గమనిస్తాం. ఇది జీవితంలో అందరికీ అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు. 

అయితే వాడి పారేసే పద్ధతిలో అంతా చెడు లేదు. కొన్ని విషయాలలో ఇది తప్పనిసరి. ఉదాహరణకు ఆరోగ్యం విషయం చూద్దాం. వెనుకటి రోజుల్లో మంచినీళ్లు తాగటానికి, కాఫీ, టీలు తాగటానికి ఇన్ని గ్లాసులు ఉండేవి కావు. మట్టి ముంతలే ఆధారం. అవి వాడిన తర్వాత అవతల పారేయాల్సిందే. అలా చేస్తేనే కుమ్మరి వారికి చేతినిండా పని.

ఇప్పుడు ఇన్ని కంచాలు, ప్లేట్లు వచ్చిన తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు, కంచాలు, టిఫిన్ ప్లేట్లు వాడిన తర్వాత పారేయవలసిందే. 

నిప్పు విషయంలో అది మంచికి, చెడుకి ఎలా ఉపయోగపడుతుందో వాడి పారేసే పద్ధతిలో కూడా అలాగే మంచి, చెడు రెండూ కలిసి ఉన్నాయి. దీనిలో పరమార్థం ఏమంటే ప్రతి పద్ధతిలో మంచి, చెడు కలిసి ఉంటాయి. దానిని అర్థం చేసుకుంటే మానసిక పరిపక్వ దిశలో ముందుంటారు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...