Wednesday, December 21, 2022

నిజము, అబద్ధములలో దేనికి విలువ ఎక్కువ

తాడిచెట్టు ఎక్కినవాడిని క్రింద వ్యక్తి ఎందుకు చెట్టు ఎక్కావు అని అడగగా ఎండు గడ్డి కోసము ఎక్కానని, సమాధానం చెప్పాడని ఒక సామెత ఉంది.

నిజంగా అతను అలా చెప్పాడో లేదో మనకు తెలియదు కానీ తాటిచెట్టు పైన గడ్డి ఉండదు, కాబట్టి ఏదో ఒక లాభం కోసం ఎక్కి ఉంటాడని అందరూ ఊహిస్తారు. ఇంకొక సామెత ఉంది. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి అని అంటారు.

పరిస్థితులు శరవేగంగా సంస్కృతులను మారుస్తున్నాయి. నిజంగా నిజం చెప్తే దైనందిన జీవితంలో హత్యలు, విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని వృత్తుల వారికైతే నిజం చెబితే వాళ్ళ వృత్తిలో సాగలేరు. నిజ జీవితంలో నిజం కన్నా అబద్ధమునకు విలువ ఎక్కువ. నిజంగా నిజం చెబితే దొంగతనములు, హత్యలు, ఇతర తప్పులు చేసిన వారు శిక్షింపబడి కాలక్రమంలో చాలా శాఖల వారికి పని ఉండదు. 

నిజంగా ఇచ్చిన మాట కోసం నిలబడి కష్టాల పాలైన సత్య హరిశ్చంద్రుని జీవిత కథ భారతజాతికి ఆదర్శం. ఆ ఆదర్శం మీద భారతీయుల జీవిత ప్రమాణములు కొలబద్దగా నడిచేవి. 

కొందరి మాటలను బట్టి అవతలవారు అబద్ధమని తేలిగ్గా గుర్తిస్తారు. కొందరి తీయటి అబద్ధములు లేక మాటలు అవతల వారికి ఆనందం కలగజేసి, అవి నిజమైతే బాగుండు అనిపిస్తాయి. 

ఈ సందర్భంలో పాండవ అగ్రజుడు ధర్మరాజు కథ తెలుసుకుందాం. మహాభారతంలో యుధ్ధం తర్వాత తన బంధువులకు, దాయాదులకు పితృ కార్యములు, తర్పణములు చేస్తున్న సందర్భంలో కుంతీదేవి ధర్మరాజు వద్దకు వచ్చి కర్ణునికి కూడా పితృకార్యము చేయమంటుంది. అప్పుడు విషయం తెలిసిన ధర్మరాజు కర్ణుడు తన సోదరుడని చెప్పనందుకు ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదని శాపం ఇచ్చినట్లు కథనం. 

ఈ శాపం విషయం ఎట్లున్నా, నిజంగా మానవులందరూ సత్యసంధులైతే రహస్యములు దాగకపోతే సమాజహాని జరుగుతుంది. నిజం చెప్తే నిష్టూరం, అబద్ధం చెప్తే ఆప్యాయతలు వచ్చే కాలమిది. కొన్ని పరిస్థితులలో అబద్ధములు నిజంగా వర్ధిల్లి, నిజం దాగడం అందరికీ మంచిది. అయితే అబద్ధం ఎప్పటికీ నిజం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...