శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఆలయం విజయవాడకు దగ్గర్లోని శ్రీకాకుళంలో ఉంది. ఆంధ్రదేశం భూమండలమునకు మధ్యలో ఉందని, దానికి శ్రీకాకుళం భూకేంద్రం అని, అందుకని శ్రీమహావిష్ణువు ఆంధ్ర విష్ణువుగా శ్రీకాకుళంలో వెలిశాడని స్థల పురాణం చెబుతోంది.
ఈ ఆలయం విజయవాడకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలో ఉంది. ఇది ఘంటసాల మండలంలో, కృష్ణా నదీ తీరాన ఉంది. ఇక్కడికి ప్రభుత్వం వారి ఆర్టీసీ బస్సులు నడపబడతాయి.
విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని ప్రేరణగా తీసుకుని ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. అంతేకాకుండా మహాదేవ శతకం, భోజ రాజీయం వంటి అనేక కావ్యాలు కూడా ఇక్కడే రచింపబడ్డాయి.
ఈదేవాలయంలో శ్రీమహావిష్ణువుని మొదట బ్రహ్మ ప్రతిష్టించి, పూజించాడని చెప్తారు. శ్రీకాకుళేశ్వరుడు అనే పేరుతో ప్రఖ్యాతి గాంచబడిన శ్రీమహావిష్ణువుని ఆంధ్ర విష్ణువు, ఆంధ్ర నాయకుడు అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వయంగా వెలిసిన శ్రీమహావిష్ణువు ప్రజల పాపాలను హరిస్తాడని భక్తులు నమ్ముతారు.
No comments:
Post a Comment