Thursday, November 10, 2022

ప్రయాణంలో ఆనందం

జీవితంలో ఆనందం పొందటానికి అనేక పద్ధతులు ఉన్నవి. మానసిక విశ్రాంతి కొరకు భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్ళడము, కొత్త ఊర్లు చూడటము ఒక పద్ధతిగా ఉన్నది.

ప్రయాణమునకు మనం ఎన్నుకునే ప్రయాణ సాధనములలో రైలు, బస్సు, కారు, విమానములను చెప్పుకోవచ్చు. కొంతమంది ఓడ ప్రయాణాలను కూడా ఇష్టపడతారు. 

అన్ని ప్రయాణ సాధనములలోకి, రైలు ప్రయాణం చౌక, అయితే వాటి ఫ్రీక్వెన్సీ తక్కువ. పగలు ప్రయాణంలో వీపుకు ఆనుకునే సౌకర్యం తక్కువ. అంతే కాకుండా, ఏ చూడదగిన ప్రదేశమూ రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉండదు. రైలు ప్రయాణంతో పోలిస్తే కొంత ఛార్జీ ఎక్కువైనప్పటికీ, ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న కారణం చేత అనేకమంది బస్సు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు. 

ఇంకా కొన్ని ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగుల మానసిక విశ్రాంతి కొరకు రెండేళ్ళకు ఒక మారు చార్జీలు భరించి ఇతర ప్రదేశములకు ఒకసారి వెళ్ళు సౌకర్యం కల్పించడం మనకు తెలుసు. ఈ అవకాశం ఎవరూ వదులుకోరాదు. వదులుకొని ఆ ప్రయాణ ఆనందమును కోల్పోరాదు.

యాత్రలు చేసేవారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటంతో పాటు వెళ్ళిన ఊర్లో వసతి సౌకర్యం చూచుకొనుట ముఖ్యం. ఇది ముఖ్యమైన రద్దీ గల దేవాలయములు గల ఊరికి వెళ్ళునప్పుడు తప్పక పాటిస్తే మంచిది, లేని యెడల ఇబ్బంది పడతారు.

యాత్రలకు యాప్స్ చాలా ఉన్నాయి. వాటిని వాడుకోవచ్చు. లేదా యాత్రి స్పెషల్స్ సహాయంతో బాధలు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఈ క్రమంలో ప్రయాణమునకు అనుకూలంగా ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్రభుత్వ రవాణా బస్సులను చెప్పుకోవచ్చు. 

ప్రయాణంలో బస్సు సౌలభ్యం చాలా ముఖ్యం. పర్యాటకమును ప్రోత్సహించి ఆరంగంలో ప్రత్యక్షముగా, పరోక్షముగా జీవనోపాధి కలిగించగల శక్తి ఆ బస్సు విభాగమునకు మాత్రమే ఉంది. ఇందుకు గాను ప్రతి శుక్రవారం రాత్రి 1½ చార్జీలతో పర్యాటక శాఖ సహకారంతో ప్రతి శని, ఆదివారములు యాత్రా ప్రణాళికల ద్వారా బస్సులు నడపవచ్చు.

యాత్ర బస్సులలో రాత్రిపూట ఎక్కడైనా బస్సు ఆగినప్పుడు పాటించవలసిన ముఖ్య జాగ్రత్త ఒకటి ఉంది. మన అవసరముల నిమిత్తము సాధ్యమైనంత మటుకు ఎడమ నుండి రోడ్డుకు కుడివైపుకు వెళ్ళుట తగ్గించాలి. రోడ్డుకు అడ్డంగా అటు నుంచి ఇటు పరిగెత్తరాదు. ఇతర వాహనముల ద్వారా రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. రోడ్డు పాడై ఉండవచ్చు. రోడ్డు మీద వచ్చే ఇతర వాహనములను గమనించడం చాలా ముఖ్యము. 

కుటుంబ సభ్యులతో కూడి అప్పుడప్పుడు ప్రకృతి సందర్శన, దేవాలయ దర్శనము, చారిత్రక ప్రదేశముల సందర్శన ఈ నిత్యజీవితంలో మానసిక విశ్రాంతి కలగజేయగలదని, అందరూ తెలుసుకుని ఒత్తిడి తగ్గించుకొండి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.