ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చల్లపల్లిలో 32 వినాయకుడి రూపాలు చూడవచ్చు. ఇక్కడ స్వయంభువుగా వెలసిన వినాయకుడు భక్తుల కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు. మూలవిరాట్టు మహావిద్యాగణపతిగా ప్రసిద్ధి చెందాడు.
ఈ వినాయకుని విగ్రహం ప్రతిష్ట వెనుక ఒక కథ ఉంది. ఈ గ్రామంలోని పంచదార పరిశ్రమ యజమాని దేవాలయం నిర్మించడానికి తవ్వకాలు జరుపుతుండగా, ఒక అరుదైన నల్లరాతి వినాయకుని విగ్రహం దొరికింది. దాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ ఉన్న మండపంలో 16 శిలా స్తంభాలు ఏర్పాటు చేసి, ఒక్కొక్క దానికి రెండేసి చొప్పున మొత్తం 32 విభిన్న రూపాల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ వినాయకుల రూపాలలోని ప్రత్యేకత ఏమిటంటే, స్వామి తొండం కుడి వైపుకు తిరిగి ఉంటుంది. తొండం ఎడమ వైపు ఉన్న వినాయకుని రూపం కంటే, తొండం కుడి వైపు వినాయక స్వామిని ఆరాధిస్తే కోరికలు త్వరగా తీరతాయని భక్తులు నమ్ముతారు.
ఒక్కొక్క వినాయకుని విగ్రహం ఒక్కొక్క రూపానికి ప్రతీకగా భావించి భక్తులు ఆరాధిస్తారు. అవి మీ కోసం ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఫోటోలు: రచయిత
No comments:
Post a Comment