Thursday, November 3, 2022

జీవితమే బంధం

వయసులో ఉన్న యువతీ యువకుల మధ్య వయసు బంధము ఏర్పడి ఋణానుబంధ రూపేణా వివాహ బంధంగా మారి, కాలక్రమంలో పేగు బంధంతో బిడ్డలకు జన్మనిస్తారు. 

బాల్యబంధంతో పెరిగి విద్యాబంధం ఏర్పడుతుంది. విద్యాబంధంతో పాటు స్నేహబంధం పెరుగుతుంది. విద్యాబంధం పూర్తి అయిన తర్వాత ఉద్యోగకాలంలో సేవా బంధంతో జీవన మార్గం ఏర్పడుతుంది. 

ఉద్యోగ కాలంలో ఆదాయ మార్గంలో ఋణములు ఏర్పడతాయి. వాటి ఒత్తిడితో మనసు ఆలోచనలతో బంధింపబడుతుంది. ఉద్యోగ, వ్యాపార, సేవల కాలంలో వివిధ బంధాలు ఏర్పడతాయి. మధ్యలో వినోదం కొరకు వివిధ బంధాలు ఏర్పడతాయి.

చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నవారికి కారాగార బంధం ఉండవచ్చు. మీరు దయగలవారైతే, పేదవారితో దానబంధం, అవసరముల నిమిత్తం ప్రతివారికీ రవాణా సాధనములతో బంధం, ఆధ్యాత్మిక ఆలోచన, ఆసక్తి ఉన్నవారికి వివిధ భక్త బంధములు ఏర్పడతాయి.

ఈ కాలంలో రోగబాధలకు వైద్యబంధము అవసరమవుతుంది. ఎన్నో బంధములు ఏర్పడి, కష్టసుఖములు పెనమేసుకున్న జీవికి అంత్యకాలంలో జీవనసమాప్తి స్మశాన బంధంతో పూర్తవుతుంది.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...