Tuesday, October 11, 2022

అవతలి ఒడ్డు, ఇవతలి ఒడ్డు - మధ్యలో కష్ట సుఖముల ప్రవాహము

మన ఎదురుగా ఒక కాలవ ఉంది. దానికి ఇవతలి ఒడ్డు, అవతలి ఒడ్డు ఉన్నాయి. దాన్ని కష్టసుఖముల కాలువగా పిలుద్దాము. 

ఒక పక్కన కష్టములు ఉన్నట్టు అనుకుని, దాని ఇవతల ఒడ్డుని కష్టాల ఒడ్డుగా భావిద్దాం. దాని అవతలి ఒడ్డులో సుఖములు ఉన్నట్టు భావించి, సుఖాల ఒడ్డుగా అనుకుందాం. ప్రవాహంలో కష్టములు, సుఖములు కలిసే ఉంటాయి. ఆ కాలవ పూర్తి పేరు జీవిత ప్రవాహ కాలువ.

పురాణములలో వైకుంఠ పురాణము అని ఒకటి ఉంది. దాని ప్రకారం మనిషి చేసే పాపములకు పరలోకంలో విధించే శిక్షలు వ్రాయబడి ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గత జన్మల్లో ఏ తప్పు చేస్తే ఈ జన్మలో ఏ రోగము వస్తుందో తెలుస్తుంది. ఆ పాపమునకు పరిహారం చెప్తారు. కొన్ని రోగాలు పూర్తిగా తగ్గవని, వాటి తీవ్రత మాత్రం తగ్గుతుందని మనకి తెలుసు.

గోడ చాటున ఉండి మాటలు వింటే బల్లిగా పుడతారని కొందరు అంటారు. కారణము ఎవరికీ తెలియదు. అలానే మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుందని అంటారు, కానీ ఎక్కడ వెతికినా ఏ మంచి పని లేక పుణ్యకార్యం చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుందో పాప ఫలితం లాగా ఎక్కడా తెలియ రాలేదు.

పనిలో పనిగా దేవుడి మహిమలు లేక ప్రకృతి ద్వారా మహిమ లేక సహాయం లభించిన వారికి మహిమలు వారికి తటస్థపడిన తరువాత ఏమైనా లాభం కలిగిందా అన్న దిశలో ఆలోచిద్దాం. కొన్ని మహిమలు లేక అనుభవాలను గూర్చి తెలుసుకుందాము: 

1. పేపర్ ద్వారా తెలిసిన వార్త: ఎన్నడూ దేవుడికి నమస్కరించని ఒక గృహిణి తాను కాఫీ తాగేటప్పుడు మాత్రం హాల్లో ఉన్న దేవుని క్యాలెండర్ కు దానిని చూపించి తాగేది. ఆ చిన్న సేవకే భగవంతుని చల్లని చూపు తన మీద ఉన్నట్టు భావన కలిగింది. 

2. దేవుడు ఆకారుడా నిరాకారుడా అనే వృధా చర్చలలో అనేకమంది కాలక్షేపం చేస్తారు. అయితే సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వంటివారు మానవ రూపంలో భూమి మీద అవతరించి, ప్రతి మానవుడి జీవిత కాలంలో పడే కష్టసుఖములను అనుభవించి, వారి జీవితకాలంలో అనేకమంది భక్తుల కోరికలు తీర్చినారు. ఇప్పుడు కూడా వారి సమాధి దర్శించిన భక్తుల కోరికలు తీరుతూ ఉండటం అనేక మందికి అనుభవమే. ఇంతెందుకు, ఆంగ్లేయుల కాలంలో వారి పరిపాలనాధికారి కలెక్టర్ మన్రో తన జీవితకాలంలో రాఘవేంద్రస్వామి సమాధి పొందిన తరువాత సశరీరముగా అనగా ఆకారంతో దర్శించుట మరియు ఒంటిమిట్ట కడప జిల్లా ప్రాంతంలో రాములవారిని సశరీరముగా దర్శించి సంభాషించుట బ్రిటిష్ వారి చరిత్రలో నమోదు కాబడినది. అలానే సినిమా రంగమునకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి తన శరీర రుగ్మతను రాఘవేంద్ర స్వామి కృపతో పోగొట్టుకోవడం చాలామంది సినిమా ప్రేక్షకులకు విదితమే. 

3. అలానే ఒక భక్తురాలు పర్వతంపై ఉన్న స్వామివారి దర్శనమునకు వెళ్ళు మెట్ల మధ్యలో పూజలో తెచ్చుకున్న పసుపు నిండుకోగా ఒక అపరిచిత వ్యక్తి ద్వారా పసుపు అందటము స్వామివారి మహిమ మానవ సహాయ రూపముగా అందిందని నమ్మింది. 

4. సాయిబాబా జీవిత చరిత్రలో ఆయన భక్తుడైన నానా చందోర్కర్ ఉద్యోగంలో భాగముగా అడవికి వెళ్లి మిట్ట మధ్యాహ్నం ఎండలో దాహముతో బాధపడుతున్నప్పుడు, ఒక వ్యక్తి వచ్చి అతను కూర్చున్న బండకిందే నీరు ఉండదని చెప్పడం, అప్పుడతడు బండ తొలగించి నీరు తాగడం, ఈ సహాయం బాబా వల్లనే లభించిందని చందోర్కర్ నమ్మడం జరిగింది.
                                                                                                                                        (సశేషం)

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.