Sunday, September 4, 2022

నారు పోసినవాడు నీరు పోయడా

పొలములో పంట నిమిత్తము పంట విత్తనములు కానీ మేలు జాతి విత్తనము యొక్క మొక్కలు గాని పొలంలో నాటడాన్ని నారు పోయడం అంటారు.

నారు వేసిన తర్వాత నీరు పోస్తేనే మొక్కలు పెరిగి పంట చేతికి వస్తుంది. ఈ అర్థములో జన్మించిన తర్వాత భగవంతుడు మంచి జీవనోపాధినివ్వడా అనే ఉద్దేశంతో పైమాట వాడతారు. ఎంత భగవంతుడు తన విధి నిర్వహించినా ఆయన సహాయం చేస్తాడని నమ్మినప్పుడు దానికి మానవ ప్రయత్నం కూడా కావాలి. 

సోమరిపోతుతనము, బద్దకము ఉండరాదు. లేకపోతే సహాయం అందదు. మానవ ధర్మాలు పాటించాలి. బాగా దాహము వేసినప్పుడు నోరు మూసుకొని ఆకాశము వైపు చూస్తే నీరు పడినా దాహము తీరదు. ఈ ప్రయత్నములో నోరు తెరవాలి. పైకప్పు లేని ప్రదేశము నుండి ఆరు బయటకు రావాలి.  

ఈలోపల వర్షపు నీరు బదులు ఆకాశము నుండి ఏ పక్షి అయినా రెట్ట వేస్తే నోరు కడుక్కోవడానికి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. కనుక కృషి చేస్తేనే భగవంతుని సహాయానికి తగిన ఫలితం ఉంటుందని తెలుసుకోవాలి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.