Saturday, September 3, 2022

ఇంటి పేరులో ఏముంది

ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణం చేత అవతలి వ్యక్తిపై అభిమానం పెంచుకుంటాడు. కులమతాల అభిమానమే కాక ఇతర అభిమానములను గురించి కూడా తెలుసుకుందాము.

మన ఊరివాడు అనే అభిమానము, మన జిల్లావాడు అనే అభిమానము, తను చదివిన విద్యాసంస్థలో చదివాడనే అభిమానము, ఒకే సంస్థలో పని చేసేవాడని అభిమానము, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మన భాష మాట్లాడే వాడని అభిమానము,  దేశం మారినప్పుడు మనదేశం వాడని అభిమానము, ఇంకా నాయకులు, కళాకారులపై అభిమానము చెప్పనక్కర్లేదు.

కొన్నేళ్ళ క్రితం నా దగ్గరకు ఒక ఆయుర్వేద మందులు అమ్మే వ్యక్తి వచ్చాడు. అతని ఇంటిపేరు నా ఇంటిపేరు ఒకటే అని తెలుసుకుని ఆ మందు యొక్క ఖరీదును తీసుకొనలేదు. నాకైతే ఇది కొత్త అభిమానంగా అనిపించి ఇంటిపేరు అభిమానం అని పెట్టుకున్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, చాలా ఇంటి పేర్లు అనేక కులములలో ఉంటాయి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.