Saturday, August 20, 2022

జీవితము - నల్లేరుపై నడక - వైద్యము

తెలుగులో ఒక సామెత ఉంది. జీవితం సాఫీగా ఒడిదుడుకులు లేక నడిచి పోయేవారిని అతని జీవితము నల్లేరుపై నడక లాగా సాఫీగా ఉంది అని అంటారు. 

నల్లేరు అంటే ఒక తీగకు కాసే చెట్టు ఆకు. పొరపాటు పడవద్దు, పల్లేరు కాదు నల్లేరు. మామూలుగా విశిష్టవ్యక్తులను ముఖమల్ తివాచీలపై నడిపించడం వారికి మనం ఇచ్చే మర్యాద. అతిథులను ఎర్రటి తివాచీపై నడిపించడం విశేష మర్యాద.

పెళ్ళిలో పెళ్ళి కొడుకులను గులాబీలపై నడిపించడం ఆచారము, మర్యాదగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో ఎవరి జీవితము సాఫీగా ఉండదు. ఒడిదుడుకులు జీవిత సహజలక్షణము. 

నల్లేరు ఆకుపై నడక అంత మెత్తగా, ఆనందముగా ఉండకపోయినా దానిలో ఒక ప్రత్యేక లక్షణం ఉన్నది. ఏ ఆకు ఇవ్వని ఆనందము, భద్రత ఇస్తుంది. 

వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చే కాళ్ళకు గుజ్జు అరిగిపోయి వచ్చే మోకాళ్ల నొప్పులను నివారించగల గొప్ప ఆయుర్వేద ఔషధము. దీని వలన ఎన్నో ఉపయోగాలున్నాయి.

పల్లెటూర్లో మాత్రమే దొరికే ఈ ఆకును వృక్షములు, ఆకులు గుర్తించే వారి ద్వారా సేకరించి నల్లేరు ఆకు పచ్చడి, నల్లేరు గారెలు, నల్లేరు కాడలతో వంటకము తిని రోగ నివారణ పొంది మీ జీవితమును నల్లేరుపై నడకలా చేసుకోండి. నల్లేరుపై నడక కాదు నల్లేరుతో నడక సాగించి మోకాళ్ళ నొప్పుల బాధలనుండి విముక్తి పొందండి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.