భూమి మీద పుట్టిన ఎవరైనా రోగములకు అతీతులు కారు. జంతువులు, పశుపక్ష్యాదులు కూడా రోగముల బారిన పడతాయి.
పూర్వకాలములో ఇంతమంది పశువుల వైద్యులు లేరు. ఇప్పుడు మానవ శరీరముతో పాటు అన్ని జంతువుల మీద రోగనివారణ వైద్యము అందుబాటులోకి వచ్చింది.
వెనకటి రోజులలో సహజ రోగ నిరోధక శక్తి సిద్ధాంతము వలన కొన్ని జంతువులకు రోగములు వచ్చినా తగ్గేవి. తల్లి జంతువులు వాటి పిల్లలు రోగాల బారిన పడినప్పుడు నాలుకతో తాకి వాటి రోగములను తగ్గించేవి. తగ్గని జంతువులు చనిపోయేవి.
మానవులకు కూడా సహజ నిరోధక శక్తి వలన కొన్ని రోగములు తగ్గుతాయి. ఒక దీర్ఘకాల రోగి ఇన్ని రోగములకు అనేక మాత్రలు వాడుట కన్నా సహజ రోగ నివారణ ఇవ్వగల ఒకే ఒక మాత్ర ఉంటే బాగుంటుందని అనుకుంటాడు. ఆరోజు రావాలని కోరుకుంటూ దాని కోసం ఎదురు చూద్దాం.
No comments:
Post a Comment