Monday, August 1, 2022

మంత్రములు

మనుషులలో మంచివారు, చెడ్డవారు ఉన్నట్లు, అలాగే మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన ఉన్నట్లు మంత్రములలో అనేక రకాలు ఉన్నాయి. 

మనకు తీరవలసినన కోరికలకు సంబంధించిన మంత్రములు చదివేటప్పుడు కనీస జాగ్రత్తగా ఆ మంత్ర విషయమై పరిచయం లేక అర్హత కలిగిన వారినుండి సలహా తీసుకోవాలి. మంత్రములలో కూడా మంచి పనులకు, చెడ్డ పనులకు ఉపయోగపడేవి ఉంటాయి. ఆ శాస్త్రములలో అనుభవం ఉన్నవారి సలహా తీసుకొనుట వలన మనకు మేలు జరుగుతుంది. 

మంత్ర శాస్త్రము చాలా అగాధమైనది, విస్తృతమైనది. ఈ సందర్భములో నా సొంత అనుభవమును మీతో పంచుకుంటాను. ఒక ఉపాసకుడిని కలిసినప్పుడు ఆయన ఒక మంత్రము చెప్పినారు. దాని విషయముగా మంత్రశాస్త్రం తెలిసిన ఇంకో వ్యక్తితో మాట్లాడగా ఆ మంత్రము వల్ల ఉచ్ఛస్థితి వస్తుందనే మాట నిజమైనప్పటికీ, కొంతకాలం తర్వాత హీనస్థితి వస్తుందని చెప్పడం జరిగింది. కనుక పూర్తిగా తెలుసుకోకుండా మంత్రపఠనం చేసి ఉంటే, తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవలసి వచ్చేది.

ఇంకొక పురాణ కథ తెలుసుకుందాము. ఒక రాజుగారి వద్దకు ఒక మహర్షి వచ్చినప్పుడు ఆ మహర్షికి రాజకుమార్తె అతిధి మర్యాదలు చేసింది. దానిని మెచ్చుకుని ఆ మహర్షి ఆ రాజకుమార్తెకు ఒక మంత్రమును ఉపదేశించినాడు. ఆ మంత్ర ప్రభావము వలన కోరుకున్న దైవము ప్రత్యక్షమై కోరుకున్న వరము ఇస్తాడని సారాంశము. 

బాల్య చాపల్యముచే ఆ మంత్రము పట్టించిన రాజకుమార్తెకు సూర్యుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఏమి కోరుకోవాలో తెలియని రాజకుమార్తెకు పుత్ర సంతానం అనుగ్రహించాడు. ఆ సంతానమే మహావీరుడైన కర్ణుడు. అతని అండతోనే దుర్యోధనుడు మహాభారతంలో ముఖ్య పాత్ర పోషించాడు. 

బలమైన బీజాక్షరములు ఉచ్ఛరించినపుడు దాని శబ్ద తరంగములు ప్రకృతిలోనే ఉన్న భగవంతుని చెంతకు చేరి అవి బాగా బలమైనప్పుడు భగవంతుని అనుగ్రహముతో మంత్రసిద్ధి అవుతుందని ఒక ఊహ.

No comments:

Post a Comment

జంతువులు, రోగ నివారణ

భూమి మీద పుట్టిన ఎవరైనా రోగములకు అతీతులు కారు. జంతువులు, పశుపక్ష్యాదులు కూడా రోగముల బారిన పడతాయి.