అపార్ట్మెంట్లో పాటించవలసిన డ్రైనేజ్ కు సంబంధించిన జాగ్రత్తలు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.
జీవన విధానంలో స్వతంత్ర ఇళ్ళ నుండి అపార్ట్మెంట్లో జీవించడం అనే పద్ధతికి శరవేగంగా మారింది. అపార్ట్మెంట్లలో మురుగునీరు పోయే వ్యవస్థ ఆగకుండా ప్రతివారు చూసుకోవాలి.
ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. శరీరమునకు వ్యర్థ పదార్థాల విసర్జన ఎంత ముఖ్యమో అపార్ట్మెంట్లలో మురుగునీరు పోయే వ్యవస్థ కూడా అంతే ముఖ్యము.
1. కుంకుడు కాయలతో తలంటు పోసుకునే వారు కుంకుడు కాయలు కొట్టేటప్పుడు కుంకుడుకాయ గింజ డ్రైనేజ్ పళ్ళెంపై పడకుండా చూసుకోవాలి, లేకపోతే నీరు పోవడం ఆగుతుంది.
2. స్నానాల గదిలో కొబ్బరి పుల్లల చీపుర్లు వాడరాదు. కొబ్బరి చీపురు పుల్లలు, స్నానం చేసేటప్పుడు రాలిపోయే జుట్టు కలిసినప్పుడు ఎన్నో సందర్భములలో మురుగునీటి వ్యవస్థ ఆగుతుంది. ప్లాస్టిక్ చీపుర్లు వాడితే మంచిది.
3. మురుగునీరు పోయే గొట్టములలో కుండీలలో మొక్కలకు నీరు పోసినప్పుడు దానిలోని మట్టి క్రిందకు దిగి మురుగునీరు పోవడం ఆగిపోతుంది.
4. మురుగునీరు పోయే గొట్టములలో గట్టి వస్తువులు, ఆహారవ్యర్థములు, పిన్నీసులు, పిన్నులు, గోలీలు లోనికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని ఇబ్బందులు తొలగి మనశ్శాంతిగా ఉంటుంది.
No comments:
Post a Comment