Wednesday, June 8, 2022

మానవ శరీర నిర్మాణము

సృష్టిలో అతి పెద్ద రహస్యం మానవ శరీర నిర్మాణముగా భావించవచ్చు. ఎన్నో రకముల  క్రిమికీటకములతో పాటు అన్ని రకముల పళ్ళు, పూలు, కూరలు, చెట్లు, జంతువులు వివిధ లక్షణాలతో అనేక రకములు మానవ ప్రయోజనములకు అనుకూలంగా ఈ సృష్టిలో ఉన్నాయి.

చెడిపోయిన శరీరభాగములకు అవయవములు ఇంకా కనుగొనబడలేదు. శరీర నిర్మాణములో అవయవములు విచిత్రంగా ఉంటాయి. శరీరమునకు స్పర్శ ముఖ్యము. ఆ స్పర్శకు ముఖ్య ఆధారము చర్మము. సైన్స్ ప్రకారము శరీరములో రక్తనాళములు, ధమనులు, సిరలు, నరములు మొదలైనవి ఉంటాయి. దాని పోషణకు మనము తీసుకునే ఆహారం నుండి విటమిన్లు, మినరల్స్, పిండిపదార్థములు, మాంసకృత్తులు, కొవ్వు పదార్ధాములు తయారయి పోషణ జరుగుతుంది.

స్త్రీ, పురుష సహకారంతో మాతృ గర్భంలో ప్రవేశించి తల్లి తీసుకునే ఆహారం ద్వారా దిన దిన ప్రవర్ధమానమై తొమ్మిది లేదా పది నెలల వ్యవధిలో భూమి మీద పడుట శిశువు కు ఒక సహజమైన మానవ జనన విధానముగా నడుస్తుంది. మానవ జీవితంలో జరుగు కష్టసుఖములు నవగ్రహములకు అనుసంధానమైన మానవ శరీరములోని అవయవముల ద్వారా జరుగునని జ్యోతిష్య శాస్త్ర వివరణ. మానవ జీవన విధానంలో భౌతిక వ్యాపకములు, ఆధ్యాత్మిక వ్యాపకములు ప్రక్కప్రక్కనే నడుస్తాయి.

బ్రహ్మంగారి జీవిత చరిత్ర ప్రకారము మానవ శరీరంలో దైవమునకు లేదా దైవశక్తితో అనుసంధానమైన ఏడు చక్రములు శరీరంలో ఉన్నాయని తెలుస్తున్నది. ఈ చక్రములు మేలుకొనుటకు వివిధ యోగ పద్ధతులు కలవు. ఈ యోగ చక్రములను నిద్రలేపి స్వాధీనం చేసుకోగలిగితే భగవంతునితో అనుసంధానం తేలిక అనే అభిప్రాయం ఉంది. 

వీటిని స్వాధీనం చేసుకొని జీవించి ఉన్నవారిలో కోయంబత్తూర్ దగ్గర గల వేదాద్రి మహర్షి ఒకరు. ఈయన కుండలినీ యోగంలో విజయం సాధించారు. ఈయన శిష్యులు నడిపే శాఖలు ఆంధ్రప్రదేశ్ లో కలవు. శరీర నిర్మాణం జరిగి భూమి మీద పడిన తర్వాత విద్య నభ్యసించి, కుటుంబీకుడై ధనసంపాదన చేయుట, బంధువర్గములను ఏర్పచుకొనుట, ఆరోగ్య సంరక్షణ జీవన విధాములో భాగముగా ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణకు గల వివిధ పద్ధతులు తెలుసుకుందాము. ఆరోగ్య సంరక్షణ రెండు భాగాలుగా ఉంటుంది. రోగములు రాకుండా రోగనిరోధకశక్తి పెంచుకునే విధము. రెండోది రోగం వచ్చిన తరువాత వైద్య చికిత్స.  

రోగనిరోధక శక్తి పెంచుకునే విధము

పతంజలి చెప్పిన యోగా వ్యాయామము, విదేశములలో ప్రాచుర్యం పొందిన రిలాక్సేషన్ టెక్నిక్స్, అనేక రకముల వ్యాయామ పరికరములు వాడుట, కాలినడక, జాగింగ్, వివిధ వ్యాయామములు చేయుట, సూర్య నమస్కారములు వగైరా చెప్పుకోవచ్చు. చేతివేళ్ళతో చేసే ముద్రలు కూడా ఒక భాగమే. ఎముకల పటిష్టత కొరకు కొందరు ఎండలో నిలబడుట - సన్ బాత్ చేస్తారు.

రోగము వచ్చిన తర్వాత చేసుకునే చికిత్సలు - అల్లోపతి, ఆయుర్వేదము, అనువంశిక వైద్యము, సిద్ధ, మూలిక, యునానీ, డిషేన్స్, హోమియోపతి, ఫిజియోథెరపీ, భూతవైద్యము, ఆక్యుపంచర్, ఆక్యూప్రెజర్, ఇతరములను దీని క్రింద చెప్పుకోవచ్చు. 

అల్లోపతి వైద్య విధానమునకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. దీనికి కారణము రోగ నిర్ధారణకు అందుబాటులోకి వచ్చిన అనేక పరీక్షలు మరియు అనేక సంవత్సరములు కష్టపడి ఆ శాస్త్రములో నిపుణత సంపాదించుకోవడం కారణముగా చెప్పుకోవచ్చు. ఈ కారణముగా వైద్యులను దైవ స్వరూపములుగా భావించుట తప్పులేదు. 

అనువంశిక వైద్యము- పుత్తూరు రాజుల ప్రకృతి మరియు ఆకు పసరుల వైద్యము. వెనుకటి రోజులలో ఇంతమంది ఎముకల చికిత్స నిపుణులు, ఇన్ని వైద్యశాలలు లేవు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో పుత్తూరు అనే ఊరు ఉంది. ఆ ఊరు నుండి రాష్ట్రంలోని జిల్లాలకు అనువంశిక వైద్యులు వెళ్లారు. వారిని పుత్తూరు రాజులు అంటారు. 

వేళ్ళు, కాళ్లు చేతులు విరిగినప్పుడు, ఎముకల వైద్యములో విరిగిన ఎముకలను అతికించే ప్రక్రియలో భాగంగా, ఆకు పసర్లు, ప్రత్యేక పట్టీల ద్వారా నయం చేసి పేద, మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన ధరలలో అందుబాటులో ఉండేవాళ్ళు. 

తీవ్రమైన జబ్బుల వలన కొన్ని శరీర భాగాలు సక్రమంగా పని చేయనప్పుడు ఫిజియోథెరపీ అనే ఇంగ్లీష్ వైద్య విధానములో భాగమైన వ్యాయామ ప్రక్రియపై రోగుల విశ్వాసము పెరిగింది.                            (సశేషం)                                                                               


No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.