Saturday, April 9, 2022

సర్వరోగ నివారిణి - పలకలూరి బావి నీళ్ళు

కొన్నేళ్ళ క్రితం గుంటూరుకు దగ్గరలోని పలకలూరులో గల బావి నీళ్ళు తాగితే రోగములు తగ్గుతాయనే ప్రచారం జరిగింది.   

ఇంకేముంది, ఈ ఊరుకిగల సిటీ బస్సుల ద్వారా ప్రజలు వేలాదిగా వెళ్ళి నీరు తెచ్చుకొని తాగారు. దీనిలో నిజమెంతో గానీ కొందరికి ఆదాయం పెరిగింది.

ఏ వార్త అయినా కొందరికి జేబులు నింపితే, మరికొందరికి జేబులు ఖాళీ చేయిస్తుంది.

ఇప్పటికీ చిత్తూరు జిల్లా కాణిపాకం దగ్గర అర్థగిరి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడ నీటిని సర్వ రోగ నివారణకు తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. సంజీవని పర్వతమును ఆంజనేయస్వామి తీసుకెళ్తున్నప్పుడు కొన్ని సంజీవని ఆకులు ఆ నీటిలో పడి, మహిమలు వచ్చినవని అక్కడివారి నమ్మకం.

అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు దగ్గరలో గల ఒక గ్రామంలోని బావి నీటిని తాగితే కుష్టువ్యాధి వస్తుందనే ప్రచారం ఉంది. 

గమనిక: ఈ బ్లాగులోని కొన్ని ఉపయోగపడే వ్యాసాలతో 'గృహిణుల పల్లకి' అనే పుస్తకమును ముద్రించుట జరిగింది. కావలసినవారు కామెంట్ సెక్షనులో తెలియచేయగలరు.


 

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...