మా చిన్నప్పుడు మేము ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో గల పట్టాభిపురంలోని మాబడికి రెండు రైలు పట్టాల మార్గం దాటి పోవలసి వచ్చేది.
ఒక పట్టా మార్గం మధ్యలో నడిచేటప్పుడు రెండో పట్టా మీద రైలు వచ్చినా లేదా మేము నడిచే పట్టాల మీద రైలు వచ్చినా సరిగా తెలిసేది కాదు. అలాంటి సమయంలో తరచూ మనుషులు చనిపోయేవారు. అలాంటి ఒక సంఘటనలో మా కుటుంబంలోని ఒక వ్యక్తి మరణం మాకు విషాదం మిగిల్చింది. ఆయన పిల్లలు, భార్య ఆదరణ కోల్పోయారు. పట్టాల మీద అజాగ్రత్తగా నడిచి, కొన్ని సార్లు ప్రమాదమునకు దగ్గరగా వెళ్ళాము.
బాల్య చాపల్యంతో పట్టాల మీద రోలు - రోకలి (దీపావళి పండుగలో చిన్న టపాకాయ కాల్చే సాధనం) పట్టాల మీద కొట్టి (ఆ సమయంలో ఒక కేంద్రమంత్రి ప్రయాణం ఉన్నది), పట్టాల కాపలాదారు నిలేస్తే, పెద్దవారిని తెచ్చి, బ్రతిమిలాడి, బయటపడిన విషయం ఇప్పటికీ గుర్తు. అలాగే దిగిన తర్వాత స్టేషన్లో ఆగి వున్న గూద్సు కిందకి దూరి, అవతల పక్కకు వెళ్ళిన తర్వాత మధ్యలో గూడ్స్ బండి కదిలి, మధ్యలో జరిగే ప్రమాద మరణం, అంగవైకల్యము చూసిన తర్వాత భయముతో గుండె ఝల్లుమనేది.
మెసేజ్: బాల్య చాపల్యంతో నడిచే రైలు, బస్సు ఎక్కి / దిగి ఆపదలకు అవకాశం ఇవ్వరాదు. స్టేషన్లో ఆగిన రైలు కింద నుండి దాటి ప్రమాదములు కొన్ని తెచ్చుకోవద్దు. రైలు పట్టాలు రైలు కొరకే కానీ, మనము నడుచుటకు కాదు. స్వచ్ఛభారత్ లో భాగంగా రైలు పట్టాల పక్కన మల, మూత్ర విసర్జన చేయరాదు.
గమనిక: ఈ బ్లాగులోని కొన్ని ఉపయోగపడే వ్యాసాలతో 'గృహిణుల పల్లకి' అనే పుస్తకమును ముద్రించుట జరిగింది. కావలసినవారు కామెంట్ సెక్షనులో తెలియచేయగలరు.
No comments:
Post a Comment