ప్రతివారికీ యాత్రలు చేయాలని, అనేక ప్రదేశములు చూసి, చారిత్రాత్మక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.
కానీ అనేక కారణాల వల్ల ఇది కుదరక పోవచ్చు. వయసులో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, పదవీ విరమణ తర్వాత ఆరోగ్యం సహకరించక పోవచ్చు. ఇవేకాక అనేక ఇబ్బందులు ఉంటాయి.
ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరైన అల్లసాని పెద్దన రచించిన శృంగార కావ్యంలోని ఒక చిన్న కథను గుర్తు చేసుకుందాం.
ప్రవరుడు అనే శ్రోత్రియుడు పరమ నిష్టాపరుడు. తల్లిదండ్రుల సేవ, కుటుంబ బాధ్యతలతోపాటు అతడికి యాత్రాభిలాష మెండు. అతడు అందగాడు. అతడిని దేవజాతికి చెందిన వరూధిని అను యువతి ప్రేమించింది. ఒకనాడు ప్రవరుడి ఇంటికి ఒక మహానుభావుడైన తపశ్శాలి అతిథిగా వచ్చాడు. ప్రవరుడు తన అతిథి సత్కారములతో ఆమహానుభావుని మెప్పించాడు. మాటల మధ్యలో ప్రవరుడు అతిథిని ఏయే ఊళ్ళు దర్శించాడో అడిగి తెలుసుకుంటూ, తన యాత్రాభిలాషను మరియు తన ఇబ్బందులను చెప్పుకున్నాడు. ప్రవరుడి ఆతిథ్యమునకు మెచ్చిన అతిథి యాత్రలకు తనడైన రహస్యం చెప్పాడు.
తన దగ్గర ఒక లేపనం ఉందని ఆ పసరును కాలికి రాసుకుంటే కోరుకున్న చోటికి వెళ్లవచ్చని తెలిపి దానిని ప్రవరుడికి ఇచ్చాడు.
లేపనము అందుకున్న ప్రవరుడు దానిని కాలికి రాసుకుని హిమాలయ దర్శనం కోరుకుని అక్కడకు చేరాడు. ప్రవరుని ఆనందమునకు అంతులేదు చాలా సంతోషంగా నడయాడి, హిమాలయ దర్శనము చేసుకున్నాడు. సాయంత్రం అయింది. ఇంటికి బయలుదేరామని అనుకున్న ప్రవరుడి కాలి లేపనం పనిచేయలేదు. హిమాలయాలలోని మంచుకు అతని కాలిపసరు కరిగిపోయింది. ఈ సందర్భంలో వరూధిని ప్రవరోపాఖ్యానము అనే కథ పాఠకులను బాగా అలరింపచేస్తుంది.
ఇప్పటి పరిస్థితులలో ప్రపంచంలోని ఒక దేశమునందు మాత్రమే రైలు ప్రయాణములు ఉచితం.
ఈ పసరుపూత ప్రయాణం కథ ఊహాజనితం అనిపించినప్పటికీ, ఇది నిజమైతే ఎంత బాగుండుననిపిస్తుంది. అలాంటి పసరుపూత ప్రయోగం నిజంగా ఆవిష్కరింపపడాలని అందరూ కోరుకుందాం. అలాంటి పసరు మూలికల కోసమే ఆధ్యాత్మిక వేత్తలు ఆలోచించవలసిన సమయమిది.
No comments:
Post a Comment