Tuesday, February 15, 2022

దాతృత్వము - మాటల మర్యాద

నా చిన్నప్పటి కథ ఒకటి జ్ఞాపకం చేసుకుందాము. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని పొలములో ఒక మూల మట్టిదిబ్బ ఉండేది.

రైతు దాని మీద నిలబడినప్పుడు మాత్రము వచ్చే, పోయేవారిని మర్యాదగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగేవాడు. కానీ వేరేచోట ఉన్నప్పుడు మాత్రం పూర్తి స్వార్థంతో మాట్లాడేవాడు. అతని ప్రవర్తన చూసిన వారికి అనుమానాలు వచ్చేవి. రెండు చోట్ల గల తేడా ఏమిటో వారికి అర్థం కాలేదు. ఆలోచించి ఆ మట్టిదిబ్బను తవ్వారు. దానికింద భోజమహారాజు సింహాసనము దొరికింది. అప్పుడు వారికి కారణము బోధపడింది. భోజమహారాజు సింహాసనము మీద కూర్చుని చేసిన దాతృత్వం, మంచి పరిపాలన లక్షణము ఆ సింహాసనమునకు వచ్చిందని అర్థం అయింది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.