Monday, February 21, 2022

బ్రహ్మచారి జీవితం మంచిదా లేక వివాహ జీవితం మంచిదా

మానవ జీవిత పరిణామంలో శిశు దశ తరువాత బ్రహ్మచారి జీవితము విద్యాభ్యాసమునకు, గృహస్థ జీవితమునకు ముందు దశ. 

బ్రహ్మచారి జీవితంలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో తల్లిదండ్రులు లేక గురువుల పర్యవేక్షణలో అనేక తెలుగు శతకములు, నైతిక విద్య, జీవితమునకు కావలసిన అనేక విషయాలు తెలుసుకునేవారు.

బ్రహ్మచారి జీవితంలో ఎక్కువ కాలం గడపడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు, జ్యోతిష్యపరంగా సర్ప దోషములు, కళత్ర స్థానము లేక వివాహ స్థానములో ఇబ్బంది పెట్టే గ్రహాల ప్రభావం కూడా కారణం కావచ్చు.

సమాజ పరంగా ఆలోచిస్తే కుటుంబములు పెరగటానికి వివాహము తప్పనిసరి. ఈ భూమి మీద తన కంటూ ఒక తోడు, కష్ట సుఖములు పంచుకొనుటకు వివాహము తప్పనిసరి. సన్యాసుల ఆదరణ  కూడా గృహస్థ జీవితంలో భాగమే. ఎడముఖం, పెడ ముఖము కలిగిన భార్య భర్తల జీవితం మినహాయిస్తే, సగటు కుటుంబ జీవితం సంతృప్తిగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముసలితనంలో భార్యాబిడ్డలు తోడుగా ఉంటారని గృహస్తు భావించగా, బ్రహ్మచారి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

శైవ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మచారి మాత్రమే సన్యాసము తల్లి అనుమతితో స్వీకరించుట పద్ధతి కాగా, ఇతర సిద్ధాంతములలో  వివాహమైన తర్వాత భార్య  అనుమతితో మాత్రమే సన్యాసము స్వీకరించుట పద్ధతిగా ఉన్నది. ఏది ఏమైనను బ్రహ్మచారి జీవితం కంటే గృహస్తు జీవితం మెరుగైనది అని భావించడంలో తప్పులేదు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...