Thursday, July 1, 2021

సతీసహగమనం

సతీదేవి దక్షుని కూతురు. తన తండ్రి అయిన దక్షుడు తన భర్త అయిన శివుడిని అవమానించడం భరించలేని సతీదేవి స్వయంగా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నది. అదేవిధంగా ఆత్మార్పణ గావించిన స్త్రీలను సతి అని, ఆ ప్రక్రియను సతీసహగమనం అంటారు.

సతీసహగమనం అనగా భర్త చనిపోయినప్పుడు ఆయనతో కలసి చనిపోవటం పాతివ్రత్య ధర్మములలో ఒకటిగా చెప్పబడినది. కానీ కాలంతో పాటు ప్రతి ఆచారమునకు విపరీత అర్థములు చెప్పి, దానికి తనకు అనుకూలంగా చెప్పు కోవడం జరుగుతున్నది.

దీనిని కొందరు స్వార్థపరులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. భర్త పోయిన తర్వాత భర్త మీద గల అనుబంధం, ప్రేమ సాన్నిహిత్యం బలముగా ఉండి, భార్య ఇచ్చామాత్రమునే ప్రాణములు వదులుట ఈ ఆచారము వెనుక గల ఉద్దేశ్యం అయి ఉండవచ్చు. వెర్రి తలలు వేసిన ఆచారం కాలక్రమేణా బలవంతపు మరణంగా మారిపోయినది. భర్త చనిపోగానే భర్త ఆస్తిని ఆశించే దగ్గరి బంధువులు భార్యకు మత్తు కలిగించి, కాలుతున్న చితిమీద పడవేసి, మంటలు తాళలేక బయటకు వద్దామని ప్రయత్నించినప్పుడు కర్రలతో అదిమిపెట్టి బలవంతపు మరణములు కలుగ చేసేవారు.

దీని మీద అసలు నిజాలు మరుగున పడ్డాయి. అనేకమంది చరిత్రకారుల ప్రకారం సతీ సహగమనం వెనుక వేరే మతస్థుల దాడులు, హిందూ స్త్రీల హక్కులకు భంగం కలగటం వంటివి ఉన్నాయి. అయితే చరిత్ర వక్రీకరించబడటం వలన అసలు నిజాలు బయటకు రాలేదు.

ఏది ఏమైనప్పటికీ, సంఘసంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటివారు పూనుకొని ఈ దురాచారమును రద్దు చేయటానికి బ్రిటిష్ ప్రభుత్వము వారిని ఒప్పించి దీనిని రద్దు చేయించారు. దీనికి వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...