Sunday, February 21, 2021

నమస్కారం మహిమ

ఎదుటి వ్యక్తిని గౌరవపూర్వకంగా పలకరిస్తూ ఉన్నప్పుడు, నమస్కారం అని చేతులు జోడించి నమస్కారం చెప్పడం మన సంప్రదాయం.

పాశ్చాత్య నాగరికతలో కొత్తవారిని కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుట పద్ధతి కాగా, కరోనా జాగ్రత్తలో భాగముగా ఆ అలవాటు తాత్కాలికముగా ఆగినది.

ఈ నమస్కారం అలవాటును గూర్చి చిన్న విషయము. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో చదివిన విషయం. కడప జిల్లా బనగానపల్లిలో సమాధి అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సాక్షాత్తూ విష్ణు స్వరూపముగా భావించబడి, తన జీవిత కాలంలో జ్ఞాన సంపన్నులు, మెరికల్లాంటి శిష్యులను తయారు చేసినారు. ఆయన శిష్యుల్లో ఒకరైన సిద్దయ్య ఒకసారి రాజు దర్శనమునకు వెళ్లి ఆయనకు నమస్కరించకుండా ఒక పక్కన నిలబడినాడు. తన దగ్గరకు వచ్చి తనకు నమస్కరించలేదని రాజుకు కోపం వచ్చి, ఆ విషయమును శిష్యునితో చెప్పినారు. అప్పుడు సిద్దయ్య రాజుతో తన నమస్కారం స్వీకరించుటకు శక్తివంతులుగా ఉండాలని, తన గురువుకు మాత్రమే నమస్కరిస్తానని చెప్పాడు. నమ్మని రాజుతో ఒక బండరాయి తెప్పించమని చెప్పి, దానిని రాజుకు సిద్దయ్యకు మధ్యలో పెట్టించి, దానికి నమస్కారం చేసినాడు. వెంటనే రాయి రెండుగా పగులుట చూసి రాజుకు జ్ఞానోదయం కలిగి, తప్పు తెలుసుకున్నాడు. ఈ సంఘటన వెనుకటి కాలంలో జరిగినా, ఈ కాలంలో అంతటి మహిమ గల శిష్యులు మనకి కనపడకపోవచ్చు. ఈ నమస్కారం మహిమను గురించిన అంతరార్థం ఆధ్యాత్మికవేత్తలు ఆలోచించవలసిన విషయం.

శుభమస్తు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...